Vijay Deverakonda And Ananya Panday Left Event Because Of Uncontrollable Crowd - Sakshi
Sakshi News home page

Liger Movie Promotions: ఫ్యాన్స్‌ అత్యుత్సాహం.. ఈవెంట్‌ మధ్యలోనే వెళ్లిపోయిన విజయ్‌, అనన్య

Published Mon, Aug 1 2022 12:57 PM | Last Updated on Mon, Aug 1 2022 1:24 PM

Vijay Deverakonda And Ananya Panday Left Event Because Of Uncontrollable Crowd - Sakshi

సౌత్‌లో ‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా యూత్‌లో అతడికి విపరీతమైన ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉంది. తనదైన స్టైల్‌, మ్యానరిజంతో యువతను బాగా ఆకట్టుకుంటున్నాడు. అలాగే ఈ రౌడీకి అమ్మయిల ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే. ఇదిలా ఉంటే లైగర్‌ మూవీతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న విజయ్‌ అక్కడ సైతం మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. దీనికి ఈ తాజా సంఘటనే ఉదాహరణ. ప్రస్తుతం విజయ్‌ లైగర్‌ మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు.

చదవండి: సెట్‌లో నోరుపారేసుకున్న హీరో, చెంప చెల్లుమనిపించిన సిబ్బంది

ఈ క్రమంలో హీరోయిన్‌ అనన్య పాండేతో కలిసి ముంబైలోని ఓ మాల్‌లో సందడి చేశాడు విజయ్‌. అక్కడ విజయ్‌, అనన్యలను చూసిన ఫ్యాన్స్‌ ప్రచార వేదిక వద్దకు గుంపులుగా దూసుకువచ్చారు. అంతేకాదు విజయ్‌.. విజయ్‌.. లైగర్‌.. లైగర్‌ అంటూ ప్యాన్స్‌ కేకలతో మాల్‌ దద్దరిల్లింది. భారీగా సంఖ్యలో ఫ్యాన్స్‌ రావడం, వారి అత్యుత్సాహంతో అక్కడ తోపులాట జరిగింది. దీంతో విజయ్‌ వారిని ప్రశాంతంగా ఉండాలని అభ్యర్తించాడు. తాను ఇక్కడే ఉన్నానని, దయచేసి మీరంత తొక్కిసలాట లేకుండా కామ్‌ అవ్వాలని ఫ్యాన్స్‌ని కోరాడు. అయినా వారంత అభిమానాన్ని ఆపుకోలేకపోయారు. దీంతో సిబ్బంది సైతం వారిని అదుపు చేయలేకపోయింది.

చదవండి: విడాకులపై ప్రశ్న.. తొలిసారి ఘాటుగా స్పందించిన చై

పరిస్థితి చేయి దాటిపోయేలా కనిపించడంతో విజయ్‌, అనన్యలు మధ్యలోనే వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక విజయ్‌ అక్కడ నుంచి వెళ్లిపోయిన అనంతరం సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. ‘మీ ప్రేమ నా హృదయాన్ని టచ్ చేసింది. మీరంతా క్షేమంగా ఇంటికి చేరుకున్నారని ఆశిస్తున్నాను. మీ అందరితో చాలా కాలం పాటు కలసి ఉండాలని అనుకుంటున్నాను. మీ అందరి గురించే ఆలోచిస్తూ బెడ్ మీదకు వెళుతున్నాను. గుడ్ నైట్ ముంబై, లైగర్’ అంటూ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. కాగా డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకులు ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement