
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం లైగర్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది చిత్రబృందం. అందులో భాగంగా శనివారం నాడు హీరో విజయ్ దేవరకొండ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో విజయ్ నగ్నంగా కనిపించడంతో పలువురు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా కనిపిస్తున్నాడన్న విషయం తెలిసిందే కదా! ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే కొన్ని అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్, అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్‌లలో పాల్గొనబోయే ఫైటర్‌ల బరువును కొలవడానికి వారు న్యూడ్‌గా ఉంటారు. వారి బరువును గ్రామ్‌లలో కొలవడానికి ఒంటిమీద నూలుపోగు కూడా ఉంచరు. ఈ లీగ్స్‌ను ఫాలో అయ్యేవారికి ఇది బాగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో వచ్చే సినిమా కాబట్టి సింబాలిక్‌గా ఈ పోస్టర్‌ను అలా విడుదల చేశారు.
ఇక ఈ పోస్టర్‌కు ట్రోల్స్‌తో పాటు ప్రేక్షకుల దగ్గరి నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. పలువురు సెలబ్రిటీలు ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం. అంతేకాదు ఈ పోస్టర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో వేగంగా 1.3 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఈ ఘనత సాధించిన తొలి పోస్టర్ ఇదే కావడం మరింత విశేషం.
చదవండి: అందుకే పెళ్లి చేసుకోలేదు.. నా పిల్లలు కారణం కాదు: స్టార్ హీరోయిన్
‘పక్కా కమర్షియల్’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
Comments
Please login to add a commentAdd a comment