విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. ఆగస్టుల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లోని హన్మకొండలో లైగర్ టీం ఫ్యాన్డమ్ టూర్‌ని నిర్వహించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ..హాయ్ వరంగల్., వర్షం పడుతున్నా తడిచిమరీ ఈ వేడుకకి విచ్చేసిన ప్రేక్షకులు, అభిమానులందరికీ లవ్ యూ. ఆగస్ట్ 25 విడుదలౌతుంది. కరణ్ జోహార్ గారికి స్పెషల్ థాంక్స్. ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. అపూర్వ మెహతా మిగతా టీం అందరికీ థాంక్స్. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారికి కృతజ్ఞతలు.
ఒక రోజు మా ఆవిడ తిట్టింది. ఎందుకంటే.. కొత్త కొత్త దర్శకులు వస్తున్నారు మంచి మంచి సినిమాలు తీసుతున్నారు.. నువ్వు వెనకపడిపోతున్నావ్.. సందీప్ రెడ్డి వంగా అనే డైరెక్టర్ వచ్చాడు. అర్జున్ రెడ్డి అనే సినిమా తీశాడు. నేను నా కూతురు మూడు సార్లు చూశాం., నువ్వూ చూడు'' అని చెప్పింది. అర్జున్ రెడ్డి చూశా. డైరెక్షన్ బావుంది.. సినిమా కూడా బాగానే వెళ్తుంది. కానీ 45 నిమిషాలు సినిమా చూసి ఆపేశా. కారణం.. సినిమాలో కుర్రాడిపై నా ద్రుష్టి ఆగిపోయింది. ఇంత నిజాయితీగా ఒక కుర్రాడు నటిస్తున్నాడని విజయ్ గురించే ఆలోచిస్తూ ఉండిపోయా. అప్పుడే విజయ్ తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నా.
విజయ్ లో నాకు నచ్చేది నిజాయితీ. లైగర్ లో ఎంత ఎలివేషన్ పెట్టినా కొంచెం పొగరు కూడా కనిపించదు. చాలా నిజాయితీగా చేశాడు. ఒక నిర్మాతగా విజయ్ కి కోటి రూపాయిలు ఇస్తే వద్దు ముందు సినిమా కోసం ఖర్చుపెట్టండని అంటాడు. తర్వాత రెండుకోట్లు పంపిస్తే.,,. మాకు అప్పులున్నాయని తెలిసి.. ముందు అప్పులు తీర్చమని తిరిగిపంపించేస్తాడు. ఈ రోజుల్లో ఇలా ఎవరంటారు ? హ్యాట్సప్ టు విజయ్. విజయ్ నాన్నగారు మా అబ్బాయిని ఒక కొడుకులా చూసుకొని మంచి సినిమా తీయ్ అన్నారు. కానీ విజయ్ నన్ను ఒక తండ్రిలా చూసుకొని నా కష్టాల్లో నాతో పాటు నిల్చున్నాడు. విజయ్ లాంటి హీరోని నేను చూడలేదు. మైక్ టైసన్ ని పట్టుకోవడానికి ఏడాది పట్టింది. ఆయన్ని ఈ సినిమాలోకి తీసుకొచ్చిన క్రెడిట్ ఛార్మికి దక్కుతుంది. మైక్ టైసన్ లాంటి లెజెండ్ తో కలసి పని చేసే అవకాశం రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం.
ఆయనతో సినిమా చేస్తామంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. అనన్య ఫైర్ బ్రాండ్. అద్భుతంగా నటిస్తుంది. రమ్యకృష్ణ గారు రెబల్ తల్లిగా కనిపిస్తారు. అమెది చాలా స్ఫూర్తిని ఇచ్చే పాత్ర. ఛార్మీ సినిమా కోసం చాలా కష్టపడుతుంది. ఏ కష్టాన్ని నా వరకూ తీసుకురానివ్వదు. సెట్ లో ఆమె ఏడ్చిన సందర్భాలు కూడా వున్నాయి. కానీ బయటికి చెప్పదు. ఛార్మీకి బిగ్ థాంక్స్. అలీతో చేసిన సినిమాలన్నీ హిట్టే. కష్టాల్లో సుఖాల్లో తోడుంటాడు. నాపై ప్రేమతో స్టేజ్ పై డ్యాన్స్ వేశాడు. రోనిత్ రాయ్, మకరంద్ దేశ్ పాండే, చంకీ పాండే, గెటప్ శ్రీను, వంశీ అందరూ ప్రేమతో చేసిన సినిమా ఇది. అజీమ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు.
భాస్కర భట్ల మంచి లిరిక్స్ రాశారు. సాగర్ సౌత్ మ్యూజిక్ చూసుకున్నారు. విష్ నటుడిగా తెలుసు. అతను రియల్ ఫైటర్. ఈ సినిమాలో బ్యాడ్ గాయ్ రోల్ ప్లేయ్ చేశాడు. మా కంపనీ సీఈవో కూడా. విష్ మా బలం. డివోపీ విష్ణు శర్మ, ఎడిటర్ జునైద్, ఆర్ట్ డైరెక్టర్ జానీ, అనిల్.. మా పీఆర్వో వంశీ- శేఖర్, లీగర్, మార్కెటింగ్ టీమ్స్ ,శ్రేయాస్ మీడియా శ్రీనివాస్.. అందరికీ కృతజ్ఞతలు. లైగర్ ఆగస్ట్ 25 న వస్తోంది. ఇది ఫుల్లీ లోడెడ్ మసాలా మూవీ. సినిమాని మీరంతా థియేటర్ లో చూడాలి' అని కోరారు.
ఛార్మీ కౌర్ మాట్లాడుతూ.. ఐ లవ్ యూ వరంగల్. ఈవెంట్ చేయాలంటే నా ఫస్ట్ ఛాయిస్ వరంగల్. ఇక్కడ ఈవెంట్ జరిగితే సినిమా సూపర్ హిట్. చివరి క్షణంలో వేదిక మారింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారు ఎంతో సహకారం అందించారు. లైగర్ గురించి చాలా మాట్లాడాలని వుంది. కానీ లైగర్ సక్సెస్ కొట్టి బిగ్ బాక్సాఫీసు నంబర్స్ క్రియేటి చేసిన తర్వాత అప్పుడు సక్సెస్ మీట్ లో మాట్లాడతాను. ఆగస్ట్ 25 వాట్ లాగా దేంగే'' అన్నారు
Comments
Please login to add a commentAdd a comment