Akdi Pakdi Song Promo Out From Vijay Devarakonda Liger Movie - Sakshi
Sakshi News home page

Akdi Pakdi Song Promo: ఆకట్టుకుంటున్న రౌడీ హీరో 'లైగర్‌' మాస్ సాంగ్‌..

Published Fri, Jul 8 2022 5:43 PM | Last Updated on Fri, Jul 8 2022 7:08 PM

Akdi Pakdi Song Promo Out From Vijay Devarakonda Liger Movie - Sakshi

Akdi Pakdi Song Promo: టాలీవుడ్‌ డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్‌ దేవరకొం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం లైగర్. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 25న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌, పోస్టర్స్‌ అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ ఇచ్చింది చిత్రబృందం. 

ఈ సినిమా నుంచి రెండో సాంగ్‌ విడుదల తేదిని ఇటివలే ప్రకటించిన విషయం తెలిసిందే. 'అకడి పకడి' అంటూ సాగే మాస్ సాంగ్‌ను జులై 11న రిలీజ్‌ చేస్తున్నట్లు తెలిపింది. తాజాగా ఈ సాంగ్‌ ప్రొమోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ప్రొమోలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. అల్ట్రా స్టైలిష్‌ లుక్‌లో మొట్టమొదటిసారిగా మాస్ స్టెప్పులు వేశాడు రౌడీ హీరో. ఈ స్టెప్పులకు విజయ్‌ ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement