డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండేలు హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం లైగర్. ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లను వేగవంతం చేసిన మూవీ టీం వరుసగా అప్‌డేట్స్ వదులోంది. ఈ క్రమంలో ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్, ట్రైలర్‌కు విశేష స్పందన వస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో లైగర్ ట్రైలర్ ట్రెండింగ్ అవుతోంది. తాజాగా మరో అప్‌డేట్‌తో లైగర్ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది మూవీ యూనిట్.
చదవండి: ఎలాంటి నెగిటివిటి లేకుండా జీవించగలను: ఐశ్వర్య ఆసక్తికర ట్వీట్
తాజాగా మేకర్స్ #WaatLagaDenge అనే హాష్‌ట్యాగ్‌తో లైగర్ యాటిట్యూడ్ సాంగ్ వీడియోను విడుదల చేశారు. సునీల్ కశ్యప్ స్వర పరిచిన ఈ పాటను విజయ్ స్వయంగా ఆలపించాడు. పూరి సాహిత్యం అందించాడు. ఇలా చిత్రబృందం డిఫరెంట్‌గా ప్రమోషన్లు చేస్తూ మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. విజయ్ పాడిన ఈ పాటకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ పాట నెట్టింట ట్రెండ్ అవుతోంది. కాగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, చార్మి కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ హీరో తల్లిగా నటిస్తుండగా.. బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ అతిథి పాల్రలో మెరవనున్నాడు.
India!
— Vijay Deverakonda (@TheDeverakonda) July 29, 2022
Presenting, The Liger attitude -
Podham. Kotladudham.
Sabki #WaatLagaDenge 🤙
- https://t.co/WNZJw6dnS4#LIGER #LigerOnAug25th pic.twitter.com/hz9yWRYpob
Comments
Please login to add a commentAdd a comment