Vijay Devarakonda Mother Performs Pooja At Home With Ananya Panday Ahead Liger Release - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: రౌడీ హీరో ఇంట పూజలు, హీరోహీరోయిన్లకు తాయత్తులు!

Published Wed, Aug 17 2022 3:30 PM | Last Updated on Wed, Aug 17 2022 5:23 PM

Liger: Vijay Devarakonda Mother Performs Pooja At Home - Sakshi

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన తాజా పాన్‌ ఇండియా చిత్రం లైగర్‌. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌ ఓ రేంజ్‌లో మార్మోగుతున్నాయి. మరోవైపు చిత్రయూనిట్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దేశాన్ని చుట్టొస్తోంది. విజయ్‌, అనన్య పాండే ఇప్పటికే పలు నగరాలను సందర్శించగా ఇంకా మరికొన్ని సిటీలను పలకరించాల్సి ఉంది. దేశాన్ని చుట్టొస్తున్న కొడుకు సురక్షితంగా ఉండాలంటూ పూజలు చేసింది రౌడీ హీరో తల్లి.

ఈ విషయాన్ని విజయ్‌ స్వయంగా ట్విటర్‌లో వెల్లడించాడు. 'దాదాపు ఈ నెలంతా ఇండియాను చుట్టాల్సి ఉంది. ఇప్పటికే మేము ఎన్నో నగరాలు తిరిగాం, ఎంతో ప్రేమను పొందాం.. కానీ అమ్మ మాకు రక్షణ అవసరమని భావించింది. కాబట్టి ఇంట్లో పూజ చేసి, మా అందరికీ తాయత్తులు కట్టింది. ఇక మేము మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నంతసేపు ఆమె ప్రశాంతంగా నిద్రపోతుంది' అంటూ పూజకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశాడు. ఇందులో విజయ్‌, అనన్య తాయత్తులు కట్టుకున్నట్లు తెలుస్తోంది.

చదవండి: ప్రభాస్‌ ‘సలార్‌’-‘హృతిక్‌’ ఫైటర్‌ ఢీకొట్టనున్నాయా?!
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌... అనురాగ్ అంచనాలు నిజమైతే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement