Director Sukumar Interview With Puri Jagannadh Over Liger Promotion - Sakshi
Sakshi News home page

Puri Jagannadh-Sukumar: పూరీ దగ్గర సుక్కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాడా!

Published Thu, Aug 25 2022 1:17 PM | Last Updated on Thu, Aug 25 2022 3:54 PM

Director Sukumar Interview With Puri Jagannadh over Liger Promotion - Sakshi

ఇద్దరు స్టార్‌ డైరెక్టర్స్‌ సినిమాల గురించి చర్చించుకుంటే ఎలా ఉంటుంది.. ఇక వారి ఫ్యాన్స్‌కి ఇదోక క్రేజీ న్యూసే కదా. అలా అభిమానులకు ఓ మంచి అనుభూతి అందించారు మన తెలుగు క్రేజీ డైరెక్టర్స్‌. నేడు(ఆగస్ట్‌ 25) లైగర్‌ మూవీ రిలీజ్‌ నేపథ్యంలో బుధవారం డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీని ఇంటర్య్వూ చేశారు మన లెక్కల మాస్టర్‌ సుకుమార్‌. ఈ సందర్భంగా పూరీ దగ్గర తాను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశానని చెప్పారు సుక్కు. 

చదవండి: సౌందర్యతో ఎఫైర్‌.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన జగపతి బాబు

ఈ నేపథ్యంలో పూరీ కథలు రాయడం, ఆయన అద్భుతమైన డైరెక్షన్‌ వెనక ఉన్న కృషి గురించి అడిగా సుకుమార్‌. కథ రాసేటప్పుడు ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందో పూరీ వివరించారు. ఈ సందర్భంగా లైగర్‌లో విజయ్‌ దేవరకొండకు లోపం పెట్టడం వెనక ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఉన్నాడంటూ ఆసక్తికర విషయం చెప్పారు పూరీ. ‘‘ఒకసారి బన్నీ నాతో మాట్లాడుతూ ‘హీరోకి ఏదైనా ఒక లోపం పెట్టి, అతని పాత్రను డిఫరెంట్ గా డిజైన్ చేయవచ్చును గదా’ అన్నారు. హీరోకి నత్తి ఉన్నట్టుగా చూపిస్తే ఎలా ఉంటుందని అడిగితే సూపర్‌గా ఉంటుందని చెప్పారు.

చదవండి: Surekha Vani: అలాంటి బాయ్‌ఫ్రెండ్‌ కావాలంటున్న నటి సురేఖ వాణి

ఇక మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఒక సినిమా చేయాలని అనుకున్న నేను ఈ బాక్సింగ్ కథ వైపు వెళ్లాను. విజయ్ దేవరకొండ పాత్రకి నత్తి పెట్టాను. అలా ఈ పాత్రను డిజైన్ చేయడం వెనుక బన్నీ ఉన్నాడు. విజయ్ దేవరకొండ ఈ పాత్రను గొప్పగా చేశాడు’’ అంటూ పూరీ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఈ మూవీ కోసం మైక్‌ టైసన్‌ను ఒప్పించడానికి ఏడాది పట్టిందని పూరీ వెల్లడించారు. ఈ సందర్భంగా తన సినిమాల్లోని హీరో క్యారెక్టరైషన్స్‌ గురించిన మరిన్ని విశేషాలను పూరీ పంచుకున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే ఇక్కడో లుక్కేయండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement