Vijay Devarakonda Get Love Proposal From Lady Fan In Liger Movie Promotions At Bengaluru, Video Viral - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: రౌడీ హీరోకు ఉంగరం తొడిగి ఏడ్చేసిన మహిళా అభిమాని, వీడియో వైరల్‌

Published Mon, Aug 22 2022 6:51 PM | Last Updated on Mon, Aug 22 2022 7:19 PM

Lady Fan Proposed to Vijay Devarakonda  In Liger Promotions In Bengaluru - Sakshi

లైగర్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దేశాన్ని చుట్టేస్తున్నాడు విజయ్‌ దేవరకొండ. హీరోయిన్‌ అనన్యపాండేతో కలిసి ఇప్పటికే పలు నగరాలు సందర్శించాడు. ఈ క్రమంలో బెంగళూరులో ఓ వీరాభిమాని రౌడీ హీరోకు రింగుతో ప్రపోజ్‌ చేసింది. మోకాలిపై కూర్చొని విజయ్‌కు ఉంగరం తొడిగి తన ప్రేమాభిమానాలను చాటుకుంది. రౌడీ హీరోను ఇలా కలిసినందుకు ఉద్వేగానికి లోనైన ఆ అమ్మాయి సంతోషంతో ఏడ్చేసింది.

దీంతో విజయ్‌.. ఆమెను హత్తుకుని ఓదార్చాడు. అంతేకాదు, ఈ ఉంగరాన్ని లైగర్‌ మూవీ ప్రమోషన్లు పూర్తయ్యేవరకు ఉంచుకుంటానని మాటిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్‌ డైరెక్ట్‌ చేసిన లైగర్‌ మూవీ ఆగస్టు 25న విడుదల కాబోతోంది. ఇందులో బాలీవుడ్‌ హీరోయిన్‌ అనన్యపాండే కథానాయికగా నటించింది.

చదవండి: విడాకుల తర్వాత ఒక్కటిగా కనిపించిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫొటో వైరల్‌
ఆగస్టు చివరి వారంలో ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement