Is Vijay Devarakonda Rejects Uppena Director Buchi Babu Film, Deets Inside - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda : లైగర్‌ ఎఫెక్ట్‌... ఉప్పెన డైరెక్టర్‌ కథను రిజెక్ట్‌ చేసిన విజయ్‌?

Published Tue, Oct 18 2022 3:23 PM | Last Updated on Tue, Oct 18 2022 5:22 PM

Is Vijay Devarakonda Rejects Buchi Babu Film - Sakshi

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం లైగర్‌. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తాకొట్టింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఫలితంగా విజయ్‌ చేయబోయే తర్వాతి ప్రాజెక్ట్స్‌పై కూడా ఈ  ప్రభావం గట్టిగానే పడింది.

లైగర్‌ ఫ్లాప్‌ తర్వాత కథల విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాడట ఈ రౌడీ బాయ్‌. దీంతో ఎంత పెద్ద దర్శకుడైనా సరే కథ నచ్చితే తప్పా సైన్‌ చేయకూడదని విజయ్‌ ఫిక్స్‌ అయ్యాడట. ఈ కారణంగానే ఉప్పెన డైరెక్టర్‌ బుచ్చిబాబు చెప్పిన కథకు కూడా విజయ్‌ నో చెప్పినట్లు టాక్‌ వినిపిస్తుంది. కథలో కొన్ని లోపాలు ఉండటంతో సున్నితంగా ఆ ప్రాజెక్ట్‌ను తిరస్కరించాడట విజయ్‌. మరి విజయ్‌ఘే డైరెక్టర్‌కి ఛాన్స్‌ ఇవ్వనున్నారో త్వరలోనే తెలియనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement