
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం లైగర్. ఆగస్ట్ 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. అందులో విజయ్ నగ్నంగా కనించారు. శరీరంపై నూలు పోగు లేకుండా.. పుష్పగుచ్చం అడ్డుపెట్టుకొని ఉన్న ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై సినీ ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు.
(చదవండి: ‘లైగర్’న్యూడ్ పోస్టర్‌పై సమంత ఆసక్తికర కామెంట్)
తాజాగా ఈ పోస్టర్‌పై నెషనల్ క్రష్ రష్మిక స్పందించింది. ఈ నగ్న ఫోటోని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ..‘ఇప్పటివరకు నన్ను ఎవరైనా ‘నీకు స్ఫూర్తి ఎవరు?’అని అడిగితే.. ఎవరి పేరు చెప్పాలో అర్థమయ్యేది కాదు. కానీ ఇకపై ఎవరైన ఆ ప్రశ్న అడిగితే.. నీ పేరే సమాధానంగా చెబుతాను. ‘లైగర్’ నీకు మా ప్రేమ, మద్దతు ఉంది. నువ్వు ఏం చేయగలవో ప్రపంచానికి చూపించు’అని రష్మిక రాసుకొచ్చింది.
ఇక రష్మిక కామెంట్‌కి రౌడీ హీరో కూడా రిప్లై ఇచ్చాడు. ‘రుషీ.. ‘గీతగోవిందం’ నుంచి నువ్వే నా స్ఫూర్తి..లైగర్ ఈ ప్రంచానికి మెరుపులు అందిస్తుందని నేను మాట ఇస్తున్నాను’అంటూ విజయ్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్, రష్మికల పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment