Netizens Trolling On Vijay Devarakonda Liger Movie Cutout, Deets Inside - Sakshi
Sakshi News home page

కటౌట్‌లా లేదు.. కట్‌ డ్రాయర్‌ యాడ్‌లా ఉంది.. ‘లైగర్‌’ కటౌట్‌పై నెటిజన్‌ ట్రోల్స్‌

Published Wed, Jul 20 2022 4:28 PM | Last Updated on Wed, Jul 20 2022 5:41 PM

Netizens Trolling On Vijay Devarakonda Liger Movie Cutout - Sakshi

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, డాషింగ్‌ అండ్‌ డేరింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా మూవీ లైగర్‌. ఇందులో విజయ్‌కి జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఆగస్ట్‌ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో చిత్రబృందం ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రమోషన్స్‌లో భాగంగా జులై 21న సినిమా ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్స్‌లో భారీ కటౌన్‌ని ఏర్పాటు చేశారు. దాదాపు 75 అడుగల ఎత్తు ఉన్న ఈ కటౌట్‌లో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌ అవతారంలో అర్థనగ్నంగా కనిపించాడు. ప్రస్తుతం ఈ కటౌట్‌  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కొంతమంది నెటిజన్స్‌ ఫన్నీగా స్పందిస్తున్నారు. అది కటౌట్‌లా లేదని.. కట్‌ డ్రాయర్‌ యాడ్‌లో ఉందని కామెంట్‌ చేస్తున్నారు. మరికొంతమంది ఈ కటౌట్‌ని ఎడిట్‌ చేసి విజయ్‌ ఫోటోకి  పంచె, బనియన్‌ తొడిగించి, నెత్తిన ఓ తలపాగ పెట్టి ‘సౌత్‌ఇండియా లైగర్‌’అంటూ ఆ ఫోటోని వైరల్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement