అమెరికా రోడ్లపై చక్కర్లు కొడుతున్న పూరి, విజయ్‌.. ఇలా రచ్చ చేస్తూ.. | Vijay Devarakonda And Puri Jagannadh Enjoys In America Over Liger Shooting | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda and Puri Jagannadh: షూటింగ్‌ గ్యాప్‌లో ఇలా రచ్చ చేసిన విజయ్‌, పూరీ

Published Sat, Nov 13 2021 6:39 PM | Last Updated on Sat, Nov 13 2021 8:27 PM

Vijay Devarakonda And Puri Jagannadh Enjoys In America Over Liger Shooting - Sakshi

Puri Jagannadh And Vijay Devarakonda In USA: డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. తాజా షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఈ నెల 12వ తేదీన టీమ్ అమెరికా చేరుకోగా, ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ చిల్ అవుతున్న‌ట్టుగా క‌నిపిస్తున్నారు.

చదవండి: Gangavva Home Tour: తన కొత్తింటిని చూపిస్తూ మురిసిపోయిన గంగవ్వ

ప్ర‌స్తుతం పూరి, విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి సంబంధించిన పిక్స్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఆయన జోడీగా అనన్య పాండే తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు. లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. మైక్ టైసన్ కూడా ముఖ్య పాత్ర‌లో సంద‌డి చేయ‌నున్నారు.

చదవండి: మాల్దీవులో వాలిపోయిన పూజా, స్టన్నింగ్‌ వీడియోలు షేర్‌ చేసిన ‘బుట్టబొమ్మ’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement