విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్‌ఇండియా మూవీ ‘లైగర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ మూవీ ఈ నెల 25న విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసేంది. పాన్ ఇండియా స్థాయికి తగినట్లే ప్రచారం కూడా చేయడంతో ‘లైగర్’గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు.
(చదవండి: సినిమా అట్టర్ ఫ్లాప్.. కలెక్షన్స్‌లో రికార్డు)
ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. లైగర్ పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. తాజాగా స్టార్ హిరోయిన్ అనుష్క శెట్టి సోషల్ మీడియా వేదికగా ‘లైగర్’టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పింది. విజయ్ కూడా అనుష్క పోస్ట్‌పై స్పందించాడు.‘ థ్యాంక్యూ సోమచ్ స్వీటీ.. అర్జున్ రెడ్డి సినిమా విడుదలప్పుడు కూడా మీకు ఇలాగే విషెస్ చెప్పారు. ఆ సినిమాలాగే లైగర్ కూడా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని విజయ్ రిప్లై ఇచ్చాడు. అయితే అనుష్క తన పోస్ట్‌లో పూరి జగన్నాథ్ ‘జగ్గుదాదా’ అని సంబోధించడం విశేషం. కాగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ చిత్రంతోనే అనుష్క వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment