Vijay Deverakonda And Ananya Panday Hook Step Video - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda-Ananya Panday: అదిరిపోయిన అనన్య, విజయ్‌ హుక్‌ స్టెప్‌, వీడియో చూశారా?

Published Mon, May 30 2022 8:10 PM | Last Updated on Mon, May 30 2022 9:00 PM

Vijay Deverakonda, Ananya Panday Hook Step To Jug Jug Jiyo Movie Song - Sakshi

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే నటించిన పాన్‌ ఇండియా చిత్రం లైగర్‌.  ఈ సినిమాతో అనన్య టాలీవుడ్‌కు పరిచయం కానుంది. త్వరలో ఈమూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ అనన్యలు అదిరిపోయే హుక్‌ స్టేప్‌ వేసి సోషల్‌ మీడియాలో దర్శనం ఇచ్చారు. లైగర్‌ నిర్మాతలో ఒకరైన కరణ్‌ జోహార్‌ లేటెస్ట్‌ మూవీ జగ్‌ జగ్‌ జియో చిత్రంను విజయ్‌, అనన్యలు ప్రమోషన్‌ చేశారు.

చదవండి: హీరోయిన్‌ అవ్వకుండానే చచ్చిపోతానేమోనని భయపడ్డా: విష్ణు ప్రియ

దీనిలో భాగంగా ఈ సినిమాలోని పంజాబ్బ‌న్ సాంగ్‌కు వీరిద్దరు కలిసి హుక్‌స్టేప్‌ వేశారు. ఈ వీడియోను షేర్‌ చేస్తూ అనన్య.. ‘ఈ పాట జోరుకు హుక్‌స్టేప్‌ వేయకుండ ఉండలేకపోయాం. ఈ సాంగ్‌ బాగా ఆకట్టుకుంటోంది. జగ్‌ జగ్‌ జియో టీం శుభాకాంక్షలు’ అంటూ షేర్‌ చేసింది. ఈ సాంగ్‌కు అనన్య, విజయ్‌లు కలిసి హుక్‌ స్టేప్‌ వేయడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకు విజయ్‌ ఫ్యాన్స్‌, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘వీరిద్దరు కలిసి డాన్స్‌ చేయడం చూస్తుంటే లైగర్‌ చిత్రంలో వీరిమధ్య రొమాన్స్‌ ఏరేంజ్‌లో ఉండబోతోందో అర్థమవుతుంది’ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

చదవండి: భారీగా రెమ్యునరేషన్‌ పెంచేసిన కేజీయఫ్‌ బ్యూటీ?, డబ్బే ముఖ్యమన్న హీరోయిన్‌

అంతేకాదు ‘లైగర్‌ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’, ‘మీ జోడి బాగుంది’ అంటూ స్పందిస్తున్నారు. లైగ‌ర్ చిత్రాన్ని ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై అపూర్వ మెహ‌తా, క‌ర‌ణ్ జోహార్, ఛార్మీ కౌర్‌, పూరీ జ‌గ‌న్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో వ‌స్తున్న ఈ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ కీ రోల్ పోషిస్తున్నాడు. సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్రలో న‌టిస్తోంది. కాగా ఈసినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆగ‌స్టు 25న తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో గ్రాండ్‌గా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement