Megastar Chiranjeevi Send Best Wishes To Liger Team | Vijay Deverakonda | Puri Jagannadh - Sakshi
Sakshi News home page

Chiranjeevi-Liger: నాకౌట్ పంచ్ ఇవ్వండి..లైగర్‌ టీమ్‌కు మెగాస్టార్‌ విషెస్‌

Published Wed, Aug 24 2022 5:29 PM | Last Updated on Wed, Aug 24 2022 6:07 PM

Megastar Send Best Wishes To Liger Team - Sakshi

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, బాలీవుడ్‌ భామ అనన్య పాండే జంటగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరి కొద్ది గంటల్లో(ఆగస్ట్‌ 25)ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌ సినిమాపై భారీ అంచనాలు ఏర్పాటు చేశాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తున్నారు లైగర్ టీమ్. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిశారు.

(చదవండి:  ‘లైగర్‌’ ఫస్ట్‌ రివ్యూ ఇదే.. సినిమా ఎలా ఉందంటే..)

‘గాడ్ ఫాదర్’సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవితో పాటు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను కూడా కలిశారు లైగర్ టీమ్.  ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి లైగర్ టీమ్ కు విషెస్‌ తెలుపుతూ.. మీలాగే ఇండస్ట్రీ కూడా దీన్ని ఈ సినిమా కోసం వెయిట్ చేస్తుంది! నాకౌట్ పంచ్ ఇవ్వండి! అంటూ ట్వీట్ చేశారు. మెగాస్టార్ విషెస్ తెలుపడంతో చిత్రయూనిట్ ఆనందం లో తేలిపోతున్నారు.

చిరంజీవి ట్వీట్‌ని విజయ్‌ దేవరకొండ రిప్లై ఇచ్చాడు. ‘మా స్వీటెస్ట్‌ మెగాస్టార్‌ చిరంజీవి.  మీరు గర్వించేలా ఈ సినిమా ఉంటుంది. ఎంజాయ్‌ చేస్తారు. మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చిరు సార్‌’అంటూ విజయ్‌ ట్వీట్‌ చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement