Liger Teaser Release Date: Vijay Devarakonda Share Liger Movie Teaser Release Date - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: 'లైగర్'​ మూవీ నుంచి సర్​ప్రైజ్​.. 'ఆకలితో ఉన్నా' అంటూ పోస్ట్​

Published Wed, May 4 2022 6:50 PM | Last Updated on Wed, May 4 2022 8:31 PM

Liger Movie: Vijay Devarakonda Shares Update - Sakshi

Liger Movie: Vijay Devarakonda Shares Update: డ్యాషింగ్​ డైరెక్టర్​ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ కాంబినేషన్​లో వస్తున్న చిత్రం 'లైగర్'. బాక్సింగ్​ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్​గా బాలీవుడ్​ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ప్రపంచ లెజండరీ బాక్సర్​ మైక్​ టైసన్​ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా ఆగస్టులో విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఇప్పటినుంచే ప్రమోషన్స్​ను మొదలు పెట్టింది చిత్రబృందం. 

ఈ క్రమంలో మూవీ గురించి సర్​ప్రైజ్​ ఇవ్వనుంది చిత్ర యూనిట్. ఈ విషయాన్ని ట్విటర్​ ద్వారా తెలిపాడు విజయ్ దేవరకొండ. 'నేను ఆకలితో ఉన్నా.. ఇండియా ఆకలితో ఉంది. ఇక ఇప్పుడు, అతన్ని చూపించే సమయం వచ్చింది' అంటూ ట్వీట్​ చేశాడు. ఈ సర్​ప్రైజ్​ను మే 9న సాయంత్రం 4 గంటలకు చూపిస్తామని పేర్కొన్నాడు. ఇక ఈ పోస్టర్​లో 'హెచ్చరిక.. అతడు వేట మొదలు పెట్టడానికి సిద్ధమయ్యాడు' అని ఉండటంతో టీజర్​ అనౌన్స్​మెంట్ లేదా స్పెషల్​ థీమ్​ సాంగ్​ రిలీజ్​ ఉంటుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. 

చదవండి: ‘లైగర్‌’కి రికార్డు డీల్స్, డిజిటల్‌, ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరే ఆఫర్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement