Vijay Devarakonda Naked Photo Goes Viral: ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. దీంతోపాటు పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఇప్పటివరకు విజయ్ దేవరకొండ ఒక్క పాన్ ఇండియా సినిమాను కూడా విడుదల చేయలేదన్న విషయం తెలిసిందే. తాను నటించిన చిత్రలేవీ బాలీవుడ్‌లో హైప్‌తో విడుదల అవ్వలేదు. కానీ తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ నటించిన ‘లైగర్’ మూవీపై టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ భారీ అంచనాలే నెలకొన్నాయి. ఆగస్టు 25న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌ను కాస్త డిఫరెంట్‌గానే ప్రమోట్ చేస్తోంది చిత్రబృందం. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తొంది. 'నటన పరంగా మానసికంగా, శారీరకంగా ఈ సినిమా కోసం నా సర్వస్వం పెట్టాను. ఇది ఎంతో ఛాలేంజింగ్ రోల్. నేను మీకు అన్ని ఇస్తాను. త్వరలో లైగర్ వచ్చేస్తుంది' అని ట్వీట్ చేశాడు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఈ ట్వీట్‌కు ఒక ఫొటో పోస్ట్ చేశాడు రౌడీ హీరో. ఈ ఫొటోలో విజయ్ దేవరకొండ నగ్నంగా ఉండి మధ్యలో రోజా పూలు అడ్డుపెట్టుకుని కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఈ పిక్ చూస్తుంటే అమీర్ ఖాన్ 'పీకే' సినిమా పోస్టర్‌ను గుర్తు చేస్తుంది.
చదవండి: విజయ్ దేవరకొండ ఫ్యాన్ గర్ల్.. వీపుపై టాటూ.. వీడియో వైరల్
A Film that took my everything.
— Vijay Deverakonda (@TheDeverakonda) July 2, 2022
As a performance, Mentally, physically my most challenging role.
I give you everything!
Coming Soon#LIGER pic.twitter.com/ljyhK7b1e1
'పీకే'లో గ్రహాంతరవాసిగా నగ్నంగా, మధ్యలో రేడియో పట్టుకుని ఉన్న అమీర్ ఖాన్ పిక్ అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో విజయ్ దేవరకొండ కనిపించి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేశాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
చదవండి: తొలిసారిగా మోహన్ బాబు, మంచు లక్ష్మీల కాంబినేషన్.. టైటిల్ ఫిక్స్
Comments
Please login to add a commentAdd a comment