Liger Movie: Vijay Devarakonda Reaction On What if Liger Flops Media Question - Sakshi
Sakshi News home page

Liger Movie-Vijay devarakon: లైగర్‌ మూవీ ఫ్లాప్‌ అయితే? విలేకరి ప్రశ్నకు విజయ్‌ షాకింగ్‌ రియాక్షన్‌

Published Tue, Aug 23 2022 7:39 PM | Last Updated on Tue, Aug 23 2022 9:14 PM

Liger Movie: Vijay Devarakonda Reaction On What if Liger Flops Media Question - Sakshi

సౌత్‌, నార్త్‌ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా లైగర్‌. మూవీ రిలీజ్‌ అయ్యేందుకు ఇంకా రెండు రోజుల మాత్రమే ఉంది. ఇక ఈ మూవీని ప్రమోషన్లో భాగంగా లైగర్‌ టీం కొద్ది రోజులుగా దేశమంత చూట్టుముడుతున్న సంగతి తెలిసిందే. నార్త్‌ నుంచి సౌత్‌ వరకు దాదాపు అన్ని పెద్ద నగరాల్లో పర్యటిస్తూ మూవీని ప్రమోట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా లైగర్‌ టీం ముంబై మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ విలేకరి నుంచి విజయ్‌కి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఒకవేళ లైగర్‌ ఫ్లాప్‌ అయితే? అని ఆయన అడిగారు.

చదవండి: నగరానికి దూరంగా చిరు బర్త్‌డే వేడుకలు, ఫొటోలు వైరల్‌

దీంతో విజయ్‌ అతడి ప్రశ్నకు షాకింగ్‌ రియాక్షన్‌ ఇచ్చాడు. ‘ఇలాంటి చిన్న విషయాలకు కోపంతో ఊగిపోనవసరం లేదు. ఇదే ప్రశ్న నన్ను కొన్నేళ్ల కిందట అడిగి ఉంటే కోపంతో ఊగిపోయేవాడిని. ఇలా అడిగినందుకు మీపై విరుచుకుపడేవాడినేమో. అప్పుడు నాకు కోపం చాలా ఎక్కువ. కానీ గత కొన్ని రోజులుగా నాకసలు కోపమే రావడం లేదు. ఎందుకంటే అభిమానులు చూపిస్తున్న ప్రేమ నన్ను పూర్తిగా మార్చేసింది. ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలా చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుని వారిని నేను అగౌరవ పరచలేను’ అని వ్యాఖ్యానించాడు.

చదవండి: ఈ ఏడాదే పెళ్లి పీటలు ఎక్కబోతున్న కియారా-సిద్దార్థ్‌, క్లారిటీ ఇచ్చిన స్టార్‌ హీరో

అనంతరం ‘లైగర్‌ ప్రమోషన్స్‌ చేస్తూ దేశమంత పర్యటిస్తున్నాం. ఎక్కడికి వెళ్లిన ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. నాకు ఆడియన్సే ముఖ్యం. వారి కోసమే మేం పని చేస్తున్నాం. వారి కలిసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునేందుకే నగరాలన్ని చూట్టుముడుతున్నాం’ అంటూ విజయ్‌ చెప్పుకొచ్చాడు. ఇక అతడి రియాక్షన్‌ చూసి అంతా షాకయ్యారు. పాన్‌ ఇండియా చిత్రమైన ఆ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని ఫ్లాప్‌ అంటూ ప్రస్తావిస్తే ఎవరైనా వారిపై కోపంతో ఊగిపోవాల్సిందే. కానీ విజయ్‌ సదరు విలేకరితో వ్యవహరించిన తీరుకు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. అతడిపై మరింత అభిమానం పెరిగిపోయిందంటూ విజయ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement