Liger Movie First Review By Film Critic Umair Sandhu, Deets Inside - Sakshi
Sakshi News home page

Liger First Review: ‘‘లైగర్‌’ ఫస్ట్‌ రివ్యూ ఇదే.. సినిమా ఎలా ఉందంటే..

Published Wed, Aug 24 2022 3:55 PM | Last Updated on Wed, Aug 24 2022 5:54 PM

Liger Movie First Review By Film Critic Umair Sandhu - Sakshi

విజయ్‌ దేవరకొండ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా మూవీ ‘లైగర్‌’ కోసం ‘రౌడీ’ఫ్యాన్స్‌ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రేపే(ఆగస్ట్‌ 25) ఈ చిత్రం విడుదల కోబోతుంది. దీంతో విజయ్‌ అభిమానుల్లో టెన్షన్‌ మొదలైంది. సినిమా ఎలా ఉంటుందో అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదలకు ముందే ‘రౌడీ’ అభిమానులకు శుభవార్త వచ్చేసింది.

దుబాయ్‌లో ఉంటూ టాలీవుడ్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ విమర్శకుడు, ఓవర్ సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు గురించి చాలా మందికి తెలుసు. ఇప్పటికే ఆయన చాలా తెలుగు సినిమాలకు ఫస్ట్ రివ్యూలు ఇచ్చారు. ఇప్పుడు ‘లైగర్‌’కి కూడా రివ్యూ ఇచ్చేశాడు. విజయ్‌ దేవరకొండ సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకొని నడిపించాడని, యాక్షన్‌ స్టంట్స్‌ అదరగొట్టేశాడని రివ్యూలో చెప్పుకొచ్చాడు.

(చదవండి: ‘లైగర్‌’కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన అనుష్క.. పూరీని ఇలా పిలిచిందేంటి?)

'విజిల్స్ వేసే మాస్ ఎంటర్టయినర్ 'లైగర్'. విజయ్ దేవరకొండ వన్ మేన్ షో చేశాడు. షో మొత్తాన్ని ఆయన దోచేశాడు. టెర్రిఫిక్ యాక్షన్ స్టంట్స్. డైరెక్షన్ అదిరిపోయింది. ఈ సినిమాలో రమ్యకృష్ణది ఒక సర్ ప్రైజ్ ప్యాకేజ్ అని ట్వీట్‌ చేస్తూ సినిమాకు మూడు స్టార్లు ఇచ్చాడు. మరి ఉమైర్ సంధు చెప్పినట్టుగానే ‘లైగర్’ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో లేదో మరికొద్ది గంటల్లో తెలుస్తుంది.   

పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. రమ్యకృష్ణ,  మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్‌ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement