Vijay Deverakonda Meets Mumbai Theatre Owner Who Called Actor Anaconda - Sakshi
Sakshi News home page

Vijay Deverakonda: తనను నానామాటలు అన్న థియేటర్‌ యజమానిని నేరుగా కలిసిన రౌడీ హీరో

Published Sun, Aug 28 2022 4:09 PM | Last Updated on Sun, Aug 28 2022 4:56 PM

Vijay Deverakonda Meets Mumbai Theatre Owner Who Called Actor Anaconda, Photo Went Viral - Sakshi

'యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండకు ఒళ్లంతా పొగరు. లైగర్‌ ప్రమోషన్స్‌లో యాటిట్యూడ్‌ చూపిస్తూ మాట్లాడాడు. అతడి చేష్టల వల్ల మేము నష్టపోయాం. అతడు కొండ కాదు అనకొండ.. అంటూ నానామాటలు అన్నాడు ప్రముఖ మల్టీప్లెక్స్, థియేటర్ మరాఠా మందిర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్. అయినా రౌడీ హీరో ఇవేమీ పెద్దగా పట్టించుకోనట్లు కనిపిస్తోంది. తాజాగా అతడు ముంబైకి వెళ్లి మనోజ్‌ దేశాయ్‌ను కలిసి తాను ఏం మాట్లాడాడో వివరించాడు. అతడితో మాట్లాడిన తర్వాత మనోజ్‌ తన విమర్శలు తప్పని తెలుసుకుని హీరోకు సారీ చెప్పాడు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'విజయ్ దేవరకొండ మాట్లాడిన దాంట్లో చిన్న బిట్ మాత్రమే నాకు ఎవరో పంపారు. అది చూసి నేను అతన్ని విమర్శించాను. విజయ్ నన్ను కలిసి తానేం మాట్లాడాడో పూర్తి వీడియో చూపించాడు. అతనిపై అనవసరంగా విమర్శలు చేశానని సారీ చెప్పాను. అతని లైగర్ సినిమాకు వసూళ్లు బాగున్నాయి. ఇలాగే కష్టపడి కెరీర్‌లో ఇంకా ఎదగాలని కోరుకుంటున్నా' అన్నారు. ఇక వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

ఇందులో రౌడీ హీరో ముఖంలో మనోజ్‌.. తనను తిట్టాడన్న కోపం మచ్చుకైనా కనిపించడం లేదు. మనస్పర్థలను తొలగించేందుకు విజయ్‌ ఇలా కలిశాడని ఒక అభిమాని అభిప్రాయపడగా.. మరొకరు మాత్రం ఇదంతా పెద్ద డ్రామాలా కనిపిస్తోంది అని కామెంట్‌ చేశారు. కాగా బాలీవుడ్‌లో రిలీజవుతున్న పెద్ద సినిమాలకు బాయ్‌కాట్‌ సెగ తగులుతున్న విషయం తెలిసిందే! ఇప్పటికే లాల్‌సింగ్‌ చడ్డా, రక్షా బంధన్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వగా తాజాగా విజయ్‌ బాలీవుడ్‌ డెబ్యూ మూవీ లైగర్‌ కూడా ఆ జాబితాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

చదవండి: చక్కటి ప్రేమకావ్యం.. ‘సీతారామం’పై చిరు ప్రశంసలు
ఆచార్య ఎఫెక్ట్‌.. కీలక నిర్ణయం తీసుకున్న కొరటాల, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement