
LIGER Glimpse: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే కథానాయిక. కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వా మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం(డిసెంబర్ 31) ఉదయం లైగర్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ముంబైలోని మురికివాడల్లో నివసించే వ్యక్తి ఛాయ్‌వాలా నుంచి బాక్సర్‌గా ఎలా మారాడన్నది చూపించారు. 'వి ఆర్ ఇండియన్స్' అంటూ లైగర్‌గా విజయ్ దేవరకొండ గర్జించాడు. మొత్తానికి ఈ వీడియోలో లైగర్ లుక్ మాత్రం అదిరిపోయినట్లు కనిపిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మైక్ టైసన్ కీలకపాత్రలో కనిపించనున్నారు.
ఈ ఏడాది సెప్టెంబరు 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. వచ్చే ఏడాది ఉగాదికి ప్రేక్షకులు ముందుకు రావాలనుకున్నప్పటికీ అది కుదరలేదు. దీంతో తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఆగస్టు 25న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment