బాలీవుడ్‌లో బాయ్‌కాట్ ట్రెండింగ్ నడుస్తోంది. ఇటీవల ఆమిర్ ఖాన్ ‘లాల్‌సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’, తాప్సీ ‘దొబారా’చిత్రాలకు ఈ బాయ్‌కాట్ సెగ తగిలింది. సినిమాలను బహిష్కరించాలని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ బాయ్‌కాట్ సెగ విజయ్ దేవరకొండను తాకింది. ఆయన నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ను బహిష్కరించాలంటూ #BoycottLigerఅనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విటర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. దీనికి కౌంటర్‌గా విజయ్ దేవరకొండ అభిమానులు, సినీ ప్రియులు ఐ సపోర్ట్ లైగర్(#iSupportLIGER), అన్ స్టాపబుల్ లైగర్(#UnstoppableLiger) అనే యాష్ ట్యాగ్ లను ట్రెండింగ్ చేస్తున్నారు.
(చదవండి: విజయ్ 'లైగర్'కు బాయ్‌కాట్ సెగ.. ట్విట్టర్‌లో ట్రెండింగ్)
లైగర్ బాయ్ కాట్ అనే దాన్ని ఎందుకు ట్రెండింగ్ చేస్తున్నారు, ఇది కరణ్ జోహార్ ప్రాజెక్ట్ అనా లేక ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోలకు వస్తున్న క్రేజ్ చూడలేకా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. వేల మంది ఆధారపడిన అతి పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమాలను బాయ్ కాట్ చేయాలని పిలువు ఇవ్వడం అర్థం లేని పని అని అంటున్నారు. లైగర్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఈ సినిమా టీమ్ ను చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ క్రేజ్ తట్టుకోలేని కొంతమంది.. బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ తో పాటు లైగర్ ను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.ఏదేమైనా బాయ్‌కాట్ ట్రెండ్ చిత్ర పరిశ్రమకు కొత్త సమస్యగా మారింది.
ఇక లైగర్ విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రమిది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment