లైగర్ సినిమా కోసం దేశంలోని ప్రధాన నగరాలన్నీ చుట్టేస్తున్నాడు విజయ్ దేవరకొండ. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఉత్తరాది, దక్షణాదిలో వరుస ప్రెస్‌మీట్స్ నిర్వహిస్తున్నాడు. అయితే ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో విజయ్ ప్రవర్తించిన తీరు బాగోలేదని విమర్శలు వచ్చాయి. దీనిపై ఓ జర్నలిస్ట్ స్పందిస్తూ.. 'మీడియా ముందు విజయ్ రెండు కాళ్లు టేబుల్ మీద పెట్టి యాటిట్యూడ్ చూపించాడని వార్తలు వస్తున్నాయి. నిజానికి ఆరోజు జరిగిందేంటంటే.. ఓ జర్నలిస్టు.. టాక్సీవాలా సమయంలో నేను మీతో చాలా ఫ్రీగా మాట్లాడేవాడిని.
అప్పుడు బాలీవుడ్‌కు వెళ్తారా? అని అడిగితే నవ్వేసి ఊరుకున్నారు. కానీ ఇప్పుడు నిజంగానే బాలీవుడ్‌కు వెళ్లారు. ఇప్పుడు ఫ్రీగా మాట్లాడాలంటే ఒకరకంగా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. విజయ్ అతడిలో భయం పోగొట్టడానికి మీరు ఫ్రీగా మాట్లాడండి.. కాలు మీద కాలేసుకుని మాట్లాడండి, నేనూ కాలు మీద కాలేసుకుని మాట్లాడతా, మనం చిల్‌గా మాట్లాడుకుందాం అని సరదాగా అన్నాడు. అలా సరదాగా టేబుల్‌పై కాళ్లు పెట్టాడు. ఆ చర్యను అక్కడున్న అందరం ఎంజాయ్ చేశాం' అని చెప్పుకొచ్చాడు.
అయినప్పటికీ కొందరు మాత్రం రౌడీ హీరోను ఇప్పటికీ తప్పుపడుతుండటంతో విజయ్ ఈ వివాదంపై స్పందించాడు. 'ఎవరి రంగంలో వారు ఎదగాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఎంతోమందికి టార్గెట్ అవుతుంటారు. కానీ మనం వాటిపై పోరాటం చేస్తూనే ఉండాలి. నీకు నువ్వు నిజాయితీగా ఉంటూ ప్రతిఒక్కరి మంచి కోరుకున్నప్పుడు ప్రజల ప్రేమ, ఆ దేవుని ప్రేమ నిన్ను తప్పకుండా రక్షిస్తుంది' అని ట్వీట్ చేశాడు.
Anybody trying to grow in their field
— Vijay Deverakonda (@TheDeverakonda) August 19, 2022
Will Always have a Target on their back - But we fightback :)
And when you are honest, yourself and want the best for everyone - The love of people and God will protect you ❤️🥰https://t.co/sWjn9ewDpr
చదవండి: బిగ్‌బాస్ ఎంట్రీని కన్‌ఫర్మ్ చేసిన బుల్లితెర కమెడియన్
ఓటీటీలోకి వచ్చేసిన షంషేరా.. ఎక్కడంటే?
Comments
Please login to add a commentAdd a comment