
ప్రస్తుతం లైగర్ మూవీ టీం ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండేలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 25న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఆమె మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ విలేఖరి తన ఫేవరేట్ తెలుగు హీరో ఎవరు? అని ప్రశ్నించారు. అందుకు ఆమె స్పందిస్తూ, తనకి అల్లు అర్జున్ అంటే ఇష్టమనీ, ఆయన డాన్స్ తనని ఆశ్చర్యపరుస్తూ ఉంటుందని చెప్పింది.
చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్, బేబీ బంప్‌తో సర్‌ప్రైజ్
ఇక ఆయన సినిమాల్లో అల వైకుంఠపురంలో చిత్రం చూశానని, తన యాక్టింగ్‌కు ఫిదా అయ్యానంటూ చెప్పుకొచ్చిది. ఇక హీరోయిన్‌లో ఎవరని అడగ్గా.. అలియా భట్‌కు తను పెద్ద ఫ్యాన్ అని తెలిపింది. కాగా ఇటీవల వరంగల్‌లో జరిగిన ఈ మూవీ ఈవెంట్‌లో అనన్య తెలుగులో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. తనకి విజయ్ తెలుగు నేర్పించాడంటూ ఆమె క్యూట్‌గా చెప్పుకొచ్చింది. కాగా లైగర్ మూవీతో అనన్య తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది.