
టాలీవుడ్లో మాస్ ఇమేజ్ కోరుకునే హీరోలెవరైనా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక్క సినిమా చేసినా, తమ ముచ్చట తీరుతుందని భావిస్తారు. ఇక ఆల్రెడీ మాస్ ఇమేజ్ ఉన్నవాళ్లు పూరి సినిమాలో చేస్తే ఆ ఇమేజ్ మరింత పెరగడం ఖాయమనే విషయం కొంతమంది హీరోల విషయంలో నిజమైంది. అదే విషయాన్ని 'లైగర్' ఇప్పుడు మరోసారి నిరూపించబోతోంది. పూరి, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో లైగర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్టుపై ఉండటం వలన ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందట.
పూరి టేకింగ్‌పై విజయ్‌కి అవగాహన పెరిగితే, విజయ్‌లో తాను చూపించవలసిన మాస్ హీరోయిజం మరింత ఉందని పూరి భావిస్తున్నాడట. అందువలన ఈ ఇద్దరూ కలిసి మరో సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. 'లైగర్'ను ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ తరువాత శివ నిర్వాణ సినిమాను పూర్తి చేసి, మళ్లీ పూరితో కలిసి విజయ్ దేవరకొండ మరో ప్రాజెక్ట్‌తో సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే పూరి, విజయ్‌లు స్పందించే వరకు వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment