
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం కెరీర్ పరంగా జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. నాగచైతన్యతో విడాకుల వరుస సినిమాలను ప్రకటిస్తూ.. బిజియెస్ట్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇలా టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు.. బాలీవుడ్ చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే.. మరో పక్క ‘పుష్ప’ లో స్పెషల్ సాంగ్ చేసి ఔరా అనిపించింది. 'ఊ అంటావా మావా ఉఊ అంటావా మావ' స్పెషల్ సాంగ్‌కి సమంత వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఆ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. అంతేకాదు సమంతకు బోలెడంత డబ్బుతో పాటు.. ఫేమ్‌ని కూడా తీసుకొచ్చిపెట్టింది.
ఇక తాజాగా సమంత మరో స్పెషల్ సాంగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. దాని కోసం పూరీ జగన్నాథ్ టీమ్ సమంతను సంప్రదించినట్లు సమాచారం.
(చదవండి: ఆ ఇద్దరి వల్లే నేనింకా బతికున్నాను : సమంత)
'ఊ అంటావా మావా ఉఊ అంటావా మావ' సాంగ్ సూపర్ హిట్ కావడంతో.. తమ సినిమాలోని స్పెషల్ సాంగ్ కూడా సామ్ చేస్తేనే బాగుంటుందని పూరీ జగన్నాథ్ టీమ్ భావిస్తోందట. అందుకే ఆమెను సంప్రదించి స్పెషల్ సాంగ్ గురించి చర్చించారట. విజయ దేవరకొండ సైతం.. సామ్ అయితేనే బాగుంటుదని భావిస్తున్నారట. ఆమెనతో తనకున్న చనువుతో ఈ విషయం చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశాడట. మరి నిజంగానే సామ్ మరో స్పెషల్ సాంగ్‌కి ఒప్పుకుందా? రౌడీ బాయ్‌తో కలిసి స్లెప్పులేస్తుందా? లేదా? తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment