
పూరి జగన్నాథ్ సినిమాలో హీరో ఎలా ఉంటాడు? చూపుల్లో నిర్లక్ష్యం, బాడీ లాంగ్వేజ్‌లో లెక్కలేనితనం, ఏదైనా చేయగలననే తెగువ.. ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఈ క్వాలిటీస్‌ని స్క్రీ¯Œ పై అలవోకగా చూపించగల సత్తా ఉన్న హీరోల్లో రామ్ ఒకరు. యస్.. పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్‌లో సినిమా సెట్ అయ్యింది. లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ సొంత నిర్మాణ సంస్థ పూరి టూరింగ్ టాకీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ – చార్మీ కౌర్) నిర్మాతలు. ఈ సినిమా కోసం రామ్ సరికొత్త లుక్‌లోకి మారారు. పూరీలో ఉన్న హై క్వాలిటీ ఏంటంటే ప్రీ ప్రొడక్ష¯Œ వర్క్‌కి ఎక్కువ, షూటింగ్‌కి తక్కువ టైమ్ తీసుకుంటారు. రామ్ ఎనర్జీ లెవల్స్ మామూలుగా ఉండవు. అందుకే జనవరిలో షూటింగ్ ఆరంభించి నాలుగే నెలల్లో పూర్తి చేసి, మేలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment