Vijay-Janhvi: Janhvi Kapoor To Romance With Vijay Devarakonda In JGM Movie - Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: రౌడీ బాయ్‌తో రొమాన్స్‌ చేయనున్న జాన్వీ కపూర్‌

Published Thu, Mar 31 2022 3:52 PM | Last Updated on Thu, Mar 31 2022 4:53 PM

Janhvi Kapoor To Romance With Vijay Devarakonda In JGM Movie - Sakshi

పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో విజయ్‌ దేవరకొండ నటించనున్న రెండో సినిమా 'జనగణమన' (JGM). లైగర్‌ సెట్స్‌పై ఉండగానే ఈ మూవీని అనౌన్స్‌ చేశారు. దీనికి సంబంధించిన ముంబైలో గ్రాండ్‌గా ఈవెంట్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సైనికుడిగా కనిపించనున్నాడు రౌడీ హీరో.ఇక ఈ సినిమాలో విజయ్‌ సరసన ఎవరు నటించనున్నారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

పాన్‌ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ని తీసుకోవాలని చూస్తున్నారట. లైగర్‌ మూవీలోనే హీరో​యిన్‌గా జాన్వీని అనకున్నా కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. దీంతో ఫైనల్లీ ఈ ప్రాజెక్ట్‌ ద్వారా జాన్వీ టాలీవుడ్‌కు పరిచయం కానున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement