
సన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా దర్శకుడు పూరి జగన్నాథ్ 'ఫైటర్' చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం విజయ్ థాయ్‌లాండ్‌లో మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాడు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ సోమవారం ముంబైలో ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాల్లో విజయ్, పూరి జగన్నాథ్, చార్మి పాల్గొన్నారు. పూరి కనెక్ట్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మిలతో కలిసి కరణ్ జొహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, విజయ్ దేవరకొండ టాలెంట్ ఏంటో అందరికీ తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. విజయ్ లేటెస్ట్ మూవీ 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫిబ్రవరి 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
చదవండి: ఫైటర్‌కు జోడి?
To new beginnings 💖
— Charmme Kaur (@Charmmeofficial) January 20, 2020
Shoot begins in mumbai from today 💪🏻@TheDeverakonda @purijagan @karanjohar @PuriConnects @DharmaMovies #VD10 #PJ37 #PCfilm #PanIndia 😍 pic.twitter.com/g8MOAk9EQY
Comments
Please login to add a commentAdd a comment