
అందాల తార ఛార్మి కౌర్ పూర్థిస్థాయిలో నిర్మాతగా మారడంతో నటనకు ప్రస్తుతం దూరంగా ఉంటుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌తో కలిసి ప్రస్తుతం ఆకాశ్ పూరి ‘రొమాంటిక్’ , విజయ్ దేవరకొండ ‘ఫైటర్’చిత్రాలను నిర్మిస్తున్నారు. ‘రొమాంటిక్’ విడుదలకు సిద్దంగా ఉండగా.. ‘ఫైటర్’ షూటింగ్ శరవేగంగా జరుగుతుండటంతో ఛార్మి ఊపిరి పీల్చుకోలేనంత బిజీ అయిపోయారు. అయితే ఆదివారం కాస్త విరామం దొరకడంతో సరదా సరదాగా గడిపారు. ఈ క్రమంలో తన కొత్త పెంపుడు కుక్కతో ఆడుకున్నారు.
‘తన ఇంట్లోకి కొత్త నేస్తం వచ్చింది’అంటూ ఆ కుక్కతో ఆడుకుంటున్న వీడియో, ఫోటోలను తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది ఛార్మి. ‘పదేళ్లు ఉంటే అందం పోతుంది.. కానీ జీవితాంతం ఆనందంగా చూసుకునే వారు పక్కన ఉంటే అదే చాలు’అన్న రీతిలో ఉన్న ఆ ఫోటో ఫోజు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక క్యూటీతో బ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా, ఛార్మికి జంతువులంటే అమితమైన ప్రేమ అనే విషయం తెలిసిందే. ఇంట్లో పెంపుడు కుక్కలు, పక్షులను పెంచుతుంది. షూటింగ్‌లకు విరామం దొరికినప్పుడల్లా వాటితో గడుపుతుంటారు.
When babies come to meet mammaa on location 🥰🥰#VD10 #PJ37 #PCfilm @puriconnects pic.twitter.com/LEcuUKiZAp
— Charmme Kaur (@Charmmeofficial) February 16, 2020
LIVE LOVE WOOF 😁
— Charmme Kaur (@Charmmeofficial) February 16, 2020
.#pets #loveofmylife 💕 pic.twitter.com/dlZgZeGwAX
చదవండి:
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’.. తమన్నా సాయం!
నితిన్ లవ్‌స్టోరీ తెలిసింది అప్పుడే
Comments
Please login to add a commentAdd a comment