ఐటమ్ సాంగ్ లో చార్మి ఇరగదీసిందట! | Charmy Kaur's stunning dance moves with Shahid Kapoor in Rambo Rajkumar | Sakshi

ఐటమ్ సాంగ్ లో చార్మి ఇరగదీసిందట!

Published Sat, Oct 19 2013 11:31 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM

ఐటమ్ సాంగ్ లో చార్మి ఇరగదీసిందట!

ఐటమ్ సాంగ్ లో చార్మి ఇరగదీసిందట!

ఇటీవల కాలంలో టాలీవుడ్ ను వదిలిసి బాలీవుడ్ పై కన్నేసినట్టు కనిపిస్తోంది.

ఇటీవల కాలంలో టాలీవుడ్ ను వదిలిసి బాలీవుడ్ పై కన్నేసినట్టు కనిపిస్తోంది. టాలీవుడ్ లో అగ్రతారగా రాణించిన చార్మికి టాలీవుడ్ లో సమంత, కాజల్, తమన్నాల నుంచి గట్టి పోటీ ఎదురవ్వడంతో కాస్తా వెనకబడిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'బుడ్డా హోగా తేరా బాప్' చిత్రంలో చార్మి కనిపించింది.
 
అయితే 'బుడ్డా' చిత్రం చార్మికి ఆశించినంత పేరును బాలీవుడ్ తీసుకురాలేకపోయింది. ఎలాగైనా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలను చార్మి తెగ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ప్రభుదేవా రూపొందిస్తున్న రాంబో రాజ్ కుమార్ చిత్రంలో ఐటమ్ సాంగ్ లో ఇరగదీసినట్టు సమాచారం. 
 
హాట్ హాట్ గా తెరకెక్కించిన ఐటమ్ సాంగ్ లో షాహీద్ కపూర్ సరసన కిక్కెంచే శృంగార భంగిమలతో అదరగొట్టినట్టు ఫిల్మ్ నగర్ లో హాట్ టాక్ గా నిలిచింది. ఈ చిత్రంలో షాహీద్ కపూర్ తోపాటు మరో బాలీవుడ్ ముద్దు గుమ్మ సోనాక్షి సిన్హా కూడా నటిస్తోంది. 
 
2007 లో కన్నడ చిత్రం లవ కుశ ద్వారా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన చార్మి.. 'నీ తోడు కావాలి' అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆతర్వాత తెలుగులో అగ్రనటుల సరసన నటించి.. టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement