
టాలీవుడ్‌లో ఎందరో స్టార్ హీరోయిన్స్ సైతం కనుమరుగైపోయారు. అలాంటి వారిలో ఆమె కూడా ఒకరు అనడంలో సందేహం లేదు. తెలుగు చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ ప్రస్తుతం నిర్మాతగా మారిపోయింది. ఇటీవలే ఆమె తీసిన ఓ మూవీ బిగ్ డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఆమెకు చెందిన చిన్నప్పటి ఫోటో నెట్టింట్లో వైరలవుతోంది. ఇంతకీ ఎవరనుకుంటున్నారా? ఇంకెవరండీ టాలీవుడ్ అందాల భామ ఛార్మి.
తక్కువ వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఛార్మి కౌర్ దాదాపు టాలీవుడ్‌లో అందరు స్టార్ హీరోలతో నటించింది. పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్‌లో కూడా నటించింది. ఆ తర్వాత సినిమా ఛాన్సులు తగ్గిపోవడంతో నిర్మాతగా కొత్త కెరీర్ ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె సినిమాలను నిర్మిస్తోంది. ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి సినిమాలు చేస్తోంది. ఇటీవల రిలీజైన లైగర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఆమె ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment