
మణిశర్మ
అదేంటి.. ఎవరైనా ఒకటోసారి.. రెండోసారి.. ఇలా మొదలు పెడతారు. కానీ ఆరోసారి.. ఒకటోసారి అంటున్నారేంటి? అనేగా మీ సందేహం. మరి ఆ డౌట్ తీరాలంటే మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమా రూపొందనుంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల చివర్లో మొదలు కానుంది. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించనున్నారు.
గతంలో పూరి జగన్నాథ్, మణిశర్మ కలిసి చేసిన ఐదు సినిమాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. వీరి కాంబినేషన్‌లో చివరగా ‘టెంపర్’ సినిమా వచ్చింది. ఆ చిత్రానికి నేపథ్య సంగీతం అందించారు మణిశర్మ. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’తో ఆరోసారి వీళ్లిద్దరూ కలిసి పని చేయనున్నారు. కాగా రామ్, మణిశర్మ కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా ఇదే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: లావణ్య.
Comments
Please login to add a commentAdd a comment