Upasana Konidela: Got UAE Golden Visa For India Expo 2020, Details Here- Sakshi
Sakshi News home page

Upasana: మెగా కోడలుకు గోల్డెన్‌ వీసా.. గ్లోబల్‌ సిటిజన్‌గా ఉపాసన

Published Mon, Dec 27 2021 3:30 PM | Last Updated on Tue, Dec 28 2021 8:26 AM

Upasana Got UAE Golden Visa For India Expo 2020 - Sakshi

Upasana Got UAE Golden Visa For India Expo 2020: మెగా ఫ్యామిలి కోడలు, మెగా పవర్‌ స్టార్‌ సతీమణి ఉపాసన పరిచయం అక్కర్లేని పేరు. తన కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ పలు రంగాల్లో రాణిస్తున్నారు. ఒకవైపు అపోలో హాస్పిటల్స్‌ చైర్‌ పర్సన్‌గా బిజిగా ఉంటూ మరోవైపు పర్యావరణ ప్రేమికురాలిగా, సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉపాసన కామినేని కొణిదెలగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నారు. కాగా తాజాగా ఉపాసన అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఎంతో ప్రసిద్ధి చెందిన దుబాయ్‌ గోల్డెన్‌ వీసాను పొందారు ఉపాసన. క్రిస్మస్‌ కానుకగా ఈ బహుమతి పొందినట్లు సోషల్‌ మీడియా వేదికగా తెలిపి సంతోషం వ్యక్తం చేశారు ఈ మెగా కోడలు. 

'ఇండియా ఎక్స్‌పో 2020 కార్యక్రమంలో పాల్గొన్నందుకు అనుకుంటా ఈ క్రిస్మస్‌కు మంచి బహుమతి లభించింది.  'వసుధైక కుటుంబం'- ప్రపంచమంతా ఒకే కుటుంబం. యూఏఈ గోల్డెన్‌ విసా పొందడం సంతోషంగా ఉంది. అన్ని దేశాల పట్ల అపారమైన గౌరవం, ప్రేమ కలిగిన భారతీయురాలిని. నేను అధికారికంగా ప్రపంచ పౌరురాలిని (గ్లోబల్‌  సిటిజన్‌).' అని ట్వీట్‌ చేశారు ఉపాసన. ఇటీవల దుబాయ్‌ 2020 ఎక్స్‌పోను సందర్శించిన ఉపాసన.. అగ్‌మెంటెడ్‌ రియాలిటీ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ కార్యక‍్రమంలో పాల్గొన్నందుకే ఉపాసన దుబాయ్‌ అందించే గోల్డెన్‌ వీసా పొందినట్లు తెలుస్తోంది. 
 


ఇదీ చదవండి: ఉపాసన ఎమోషనల్‌ పోస్ట్‌.. సమంత రియాక్షన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement