![Allu Arjun Honoured With Golden Visa From Dubai Governament - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/20/allu-arjun.jpg.webp?itok=X8msno1d)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు దుబాయ్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం దక్కింది. ప్రసిద్ది చెందిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) గోల్డెన్ వీసా తాజాగా బన్నీ అందుకున్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పోస్ట్ షేర్ చేశారు. కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఇచ్చే యూఏఈ గోల్డెన్ వీసాను అందుకున్న టాలీవుడ్ తొలి హీరోగా అల్లు అర్జున్ నిలవడం విశేషం. ఈ మేరకు బన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశారు. దుబాయ్ దేశం ఫొటోను షేర్ చేస్తూ.. ‘నాకు ఎన్నో అనుభూతులు పంచిన దుబాయ్‌కి థాంక్స్. త్వరలోనే మళ్లీ కలుద్దామ’ అంటూ పోస్ట్ చేశాడు.
చదవండి: మైల్‌స్టోన్ దిశగా హీరో ధనుష్.. 50వ సినిమా ఫిక్స్
కాగా ఇప్పటికే ఈ వీసాను కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్, నటి కాజల్ అగర్వాల్, అమలా పాల్, ఖుష్బు సుందర్, త్రిష, బాలీవుడ్ బాద్‌షా షారుక్, సోనూసూద్, తమిళ హీరో విక్రమ్‌తో పాటు తదితర నటీనటులు అందుకున్నారు. అంతేకాదు మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ఈ వీసా అందుకున్నారు. కాగా వివిధ రంగాల్లో అంటే కళలు, క్రియేటివిటీ పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్, విద్య, వారసత్వ సంపద చరిత్ర గురించి అధ్యయనం చేసేవాళ్లు, సేవలు అందిస్తున్న వాళ్లకు యూఏఈ (దుబాయ్) ప్రభుత్వం గోల్డెన్ వీసాను జారీ చేస్తుంది. దీని ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలికంగా ఎలాంటి పరిమితులు లేకుడా స్వేచ్ఛగా నివాసం ఉండేందుకు వీలు కలుగుతుంది. 2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తుందీ యూఏఈ ప్రభుత్వం.
చదవండి: హీరోయిన్‌తో విద్యార్థి అనుచిత ప్రవర్తన, అసహనం వ్యక్తం చేసిన నటి
Comments
Please login to add a commentAdd a comment