సాక్షి, హైదరాబాద్: ఇటీవలే పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గోల్డెన్ వీసాను అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది. తాజాగా దీన్ని అందుకున్న సినీ ప్రముఖుల లిస్ట్‌లో చిరంజీవి చేరారు.
గోల్డెన్ వీసా అంటే..
విదేశాలకు చెందిన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన విదేశీ పౌరులకు యూఏఈ ప్రభుత్వం జారీ చేసేదే గోల్డెన్ వీసా. దీన్ని గరిష్టంగా పదేళ్ల కాలపరిమితికి అందిస్తారు. గోల్డెన్ వీసా వల్ల యూఏఈలో దీర్ఘకాల నివాసానికి వీలవుతుంది. వందశాతం ఓనర్‌షిప్‌తో సొంతంగా వ్యాపారాలు చేసుకోవడం సాధ్యమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment