ఒక సినిమా నూటనలభై మంది స్టార్స్‌! | Mohanlal and Mammootty team up for crime thriller with 140 artistes | Sakshi
Sakshi News home page

ఒక సినిమా నూటనలభై మంది స్టార్స్‌!

Published Sun, Feb 7 2021 12:23 AM | Last Updated on Sun, Feb 7 2021 4:51 AM

Mohanlal and Mammootty team up for crime thriller with 140 artistes - Sakshi

మమ్ముట్టి, మోహన్‌ లాల్

కోవిడ్‌ వల్ల ఇబ్బందిపడ్డ సినీ కార్మికులకు సహాయంగా ఓ మెగా మల్టీస్టారర్‌ చిత్రం చేయడానికి రెడీ అయింది మలయాళ చిత్రసీమ. అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (అమ్మ)  నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని ‘అమ్మ’ అధ్యక్షుడు మోహన్‌ లాల్‌ ప్రకటించారు. ప్రముఖ మలయాళ దర్శకులు ప్రియదర్శన్, టీకే రాజీవ్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

ఇందులో మోహన్‌ లాల్, మమ్ముట్టి ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. వీరిద్దరే కాకుండా మలయాళంలో టాప్‌ స్టార్స్‌ అందరూ ఈ సినిమాలో కనిపించనున్నారు. సుమారు 140 మంది నటీనటులు ఈ చిత్రంలో భాగమవ్వనున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఇండస్ట్రీలో ఎంతో మందికి పని కల్పించడంతో పాటు  వచ్చే మొత్తాన్ని ఇబ్బందుల్లో ఉన్న సినీ కార్మికులకు సహాయం చేయడానికి వినియోగించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement