Mega Multi Starer
-
ఒక సినిమా నూటనలభై మంది స్టార్స్!
కోవిడ్ వల్ల ఇబ్బందిపడ్డ సినీ కార్మికులకు సహాయంగా ఓ మెగా మల్టీస్టారర్ చిత్రం చేయడానికి రెడీ అయింది మలయాళ చిత్రసీమ. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని ‘అమ్మ’ అధ్యక్షుడు మోహన్ లాల్ ప్రకటించారు. ప్రముఖ మలయాళ దర్శకులు ప్రియదర్శన్, టీకే రాజీవ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో మోహన్ లాల్, మమ్ముట్టి ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. వీరిద్దరే కాకుండా మలయాళంలో టాప్ స్టార్స్ అందరూ ఈ సినిమాలో కనిపించనున్నారు. సుమారు 140 మంది నటీనటులు ఈ చిత్రంలో భాగమవ్వనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇండస్ట్రీలో ఎంతో మందికి పని కల్పించడంతో పాటు వచ్చే మొత్తాన్ని ఇబ్బందుల్లో ఉన్న సినీ కార్మికులకు సహాయం చేయడానికి వినియోగించనున్నారు. -
'మెగా మల్టీస్టారర్‌కు పవన్ ఓకె చెప్పాడు'
కళాబంధు టి సుబ్బిరామి రెడ్డి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో ఓ భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని ప్రకటించిన సుబ్బిరామిరెడ్డి. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. అయితే ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడిన పవన్, అలాంటి ప్రొపోజల్ తన దగ్గరకు రాలేదని వస్తే ఆలోచిస్తానని ప్రకటించటంతో ఈ భారీ మల్టీ స్టారర్ ఉంటుందో లేదో అన్న అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన సుబ్బిరామిరెడ్డి మరోసారి మెగా మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమవుతోందని ప్రకటించాడు. అంతేకాదు ఇప్పటికే పవన్ కళ్యాణ్ సంప్రదించామని.. ఆయన ఆనందంగా ఈ సినిమాకు అంగీకరించారని తెలిపాడు. ప్రస్తుతం చిరు, పవన్‌లు కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని తెలిపాడు. నిర్మాణంలో అశ్వనీదత్ తనకు సహకరిస్తారని తెలిపాడు.