'మెగా మల్టీస్టారర్కు పవన్ ఓకె చెప్పాడు'
కళాబంధు టి సుబ్బిరామి రెడ్డి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో ఓ భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని ప్రకటించిన సుబ్బిరామిరెడ్డి. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. అయితే ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడిన పవన్, అలాంటి ప్రొపోజల్ తన దగ్గరకు రాలేదని వస్తే ఆలోచిస్తానని ప్రకటించటంతో ఈ భారీ మల్టీ స్టారర్ ఉంటుందో లేదో అన్న అనుమానాలు ఏర్పడ్డాయి.
అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన సుబ్బిరామిరెడ్డి మరోసారి మెగా మల్టీస్టారర్కు రంగం సిద్ధమవుతోందని ప్రకటించాడు. అంతేకాదు ఇప్పటికే పవన్ కళ్యాణ్ సంప్రదించామని.. ఆయన ఆనందంగా ఈ సినిమాకు అంగీకరించారని తెలిపాడు. ప్రస్తుతం చిరు, పవన్లు కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని తెలిపాడు. నిర్మాణంలో అశ్వనీదత్ తనకు సహకరిస్తారని తెలిపాడు.