T Subbirami reddy
-
మాజీ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి సంస్థకు భారీ టోకరా.. ఇద్దరు అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): మాజీ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి భార్య ఇందిరా రెడ్డి చైర్పర్సన్, ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్న గాయత్రి ప్రాజెక్టస్ లిమిటెడ్ (జీపీఎల్) సంస్థకు భారీ టోకరా వేసిన కేసులో ఇద్దరు నిందితులను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు అరెస్టు చేశారు. ముంబైకి చెందిన ఛాంపియన్ ఫిన్సెక్ లిమిటెడ్ (సీఎఫ్ఎల్) డైరెక్టర్లు నిందితులుగా గుర్తించి, అక్కడే అరెస్టు చేసి తీసుకువచ్చామని సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి సోమవారం వెల్లడించారు. వివిధ రకాలైన నిర్మాణాలు, హైవేల కాంట్రాక్టులు చేపట్టే జీపీఎల్ సంస్థ ప్రధాన కార్యాలయం బంజారాహిల్స్‌లో ఉంది. కొన్నాళ్ల క్రితం సీఎఫ్ఎల్ డైరెక్టర్లు చేతన్ బాలుబాయ్ పటేల్, హర్షవర్ధన్ అవినాష్ ప్రదాన్ జీపీఎల్ సంస్థను సంప్రదించారు. వీరి అవసరాలకు రూ.11.5 కోట్లు రుణం ఇస్తామంటూ ముందుకు వచ్చారు. జీపీఎల్‌కు చెందిన 69,63,000 షేర్లు తనఖా పెట్టుకుని ఈ రుణం ఇప్పించ్చేలా, అందుకు 1 శాతం కమీషన్ సీఎఫ్‌ఎల్‌కు చెల్లించేలా వీరి మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో జీపీఎల్ సంస్థ ప్రాథమికంగా ఒక్కోటి రూ.33.05 విలువైన (అప్పటి విలువ) 3.25 లక్షల షేర్లను సీఎఫ్‌ఎల్‌కు బదిలీ చేసింది. అయితే నిర్దేశిత గడువు ముగిసినా సీఎఫ్ఎల్ మాత్రం గాయత్రి సంస్థకు ఎలాంటి రుణం మంజూరు చేయించలేదు. అంతటితో ఆగని సీఎఫ్ఎల్ సంస్థ తమ వద్ద ఉన్న జీపీఎల్ షేర్లను వారి అనుమతి లేకుండా బహిరంగ మార్కెట్లో విక్రయించింది. ఈ విషయం తెలుసుకున్న జీపీఎల్ సంస్థ ఈ ఏడాది జూలైలో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా అధికారులు సీఎఫ్ఎల్ డైరెక్టర్లు అవినాష్ ప్రధాన్, చేతన్ బాలుబాయ్ పటేల్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇరువురినీ ముంబైలో అరెస్టు చేసి సిటీకి తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. -
ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగే ఉంటారు చిరంజీవి
‘‘సముద్రమంత లోతున్న మంచితనం, శిఖరమంత ఎత్తున్న గొప్పతనం.. నా జీవితంలో మంచికీ చెడుకి మధ్య నిల్చున్న వ్యక్తి చిరంజీవి’’ అన్నారు దర్శకుడు రాఘవేంద్రరావు. చిరంజీవి జీవితంపై సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు రచించిన ‘మెగాస్టార్– ది లెజెండ్’ పుస్తకాన్ని ‘కళాబంధు’ టి.సుబ్బిరామిరెడ్డి ఆవిష్కరించి, దర్శకుడు రాఘవేంద్రరావుకి తొలి ప్రతిని అందజేశారు. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘హిమాలయాలంత ఎత్తుకి ఎదిగినా ఒదిగే ఉంటారు చిరంజీవి. అందుకే ఆయన 40 ఏళ్లుగా స్టార్‌గా ఉన్నారు. మరో 20 ఏళ్లు కూడా ఉంటారు’’ అన్నారు. ‘‘మొదటి 3–4 ఏళ్లే మేమిద్దరం బావ–బామ్మర్దిగా ఉన్నాం. ఆ తర్వాత స్నేహితుల్లా ప్రయాణించాం. చిరంజీవిగారితో నాది 40ఏళ్ల ఏమోషనల్ జర్నీ. కష్టపడే తత్వానికి నిదర్శనం ఆయన’’ అన్నారు అల్లు అరవింద్. ‘‘ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి జీవితాన్ని పుస్తకంగా మలచడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను. ఈ పుస్తకం వెనుక మూడేళ్ల ప్రయాణం ఉంది’’ అన్నారు వినాయకరావు. ‘‘చిన్నతనంలో నాన్న ఎంత కష్టపడి పని చేసేవారో చూసే అవకాశం మాకు దొరికేది కాదు. ఇప్పటికీ మాకు ఏం అందించాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ పుస్తకం ద్వారా నాన్నకు మరింత దగ్గరవుతాను అనుకుంటున్నాను. వినాయకరావుగారికి మా కుటుంబం, అభిమానులందరి తరఫున ధన్యవాదాలు’’ అన్నారు రామ్‌చరణ్. మురళీమోహన్, దర్శకుడు బి.గోపాల్, వీవీ వినాయక్, స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో నా ఫ్యాన్స్ ఎక్కువ
సాక్షి, బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): సినిమాల్లో గుర్తింపు వచ్చిన తరువాత తన మొదటి ఫ్యాన్స్ అసోసియేషన్ వైజాగ్‌లోనే ఏర్పాటయిందని నటి జయసుధ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా సుబ్బరామిరెడ్డి లలిత కళాపీఠం ఆధ్వర్యంలో నటి జయసుధకు అభినయ మయూరి బిరుదును పోర్టు ఆడిటోరియంలో మంగళవారం అందజేశారు. బిరుదు అందుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అభిమానుల్లో ఎక్కువ మంది విశాఖలోనే ఉన్నారన్నారు. అలాంటి విశాఖలో గొప్ప బిరుదు అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. టీఎస్సార్ నిరంతరం కళాకారులను ప్రోత్సహించడమే అలవాటుగా మార్చుకున్నారన్నారు. అంతేకాకుండా విశాఖను ఆయన ప్రేమించినంతగా ఎవరు ప్రేమించి ఉండరని చెప్పారు. ఇంత మంది ప్రముఖుల మధ్య తనకు అభినయ మయూరి బిరుదు ప్రదానం చేయడం చాలా మాటల్లో చెప్పలేని ఆనందంగా ఉందన్నారు. ముందుగా టీఎస్సార్ ఓంకారం నాదంతో కార్యక్రమం ప్రారంభించారు. నటి ఉర్వశి శారద మాట్లాడుతూ టీఎస్సార్ చాలా మందికి సహాయం చేస్తారని కాని ఆవిషయం ఎప్పుడు చెప్పుకోని గొప్ప వ్యక్తి అన్నారు. ఏపీఐఐసీ చైర్మన్ రోజా మాట్లాడుతూ అన్ని రంగాల్లో విజయం సాధించిన వ్యక్తి టీఎస్సార్ అన్నారు. వైజాగ్ అంటే మొదట బీచ్ ఆ తరువాత టీఎస్సార్ గుర్తుకు వస్తారన్నారు. నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో టీఎస్సార్ ఒకరు అన్నారు. గత 14 ఏళ్లుగా ఆయన జన్మదిన వేడుకలకు విశాఖకు రావడం జరుగుతోందన్నారు. మాజీ ఎంపీ మురళీ మోహన్ మాట్లాడుతూ మరో శ్రీకృష్ణదేవారాయులు టీఎస్సార్ అన్నారు. నిరంతరం కళాకారులను ప్రోత్సహించడంలో టీఎస్సార్ తరువాతే ఎవరైనా అన్నారు. జయసుధ నటన చాలా అద్భుతంగా ఉంటుందన్నారు. అందుకే ఆమె సహజనటి అయిందని కొనియాడారు. రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ టీఎస్సార్ జన్మదిన వేడుకలు తెలుగు పండుగతో సమానమన్నారు. చాలా మంది ప్రముఖులు ఆయన జన్మదినం కోసం విశాఖకు వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, టీజీ వెంకటేష్, రామకృష్ణరాజు, ఎంవీవీ సత్యనారాయణ, నటి జీవిత, ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గొల్లబాబూరావు, నాగిరెడ్డి, గంటా శ్రీనివాస రావు తదితులు పాల్గొన్నారు. జయసుధ ఎందరికో ఆదర్శం మన జీవితంలో ఎంతో మంది స్నేహితులు ఉంటారు.అందులో కొంత మంది మాత్రమే బంధువులు అవుతారని నటి రాధిక అన్నారు. అలాంటి స్నేహితురాలే జయసుధ అన్నారు. జయసుధకు ఈ రోజు ఈ బిరుదు ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. జయసుధ తనకు ఫోన్ ఈ కార్యక్రమానికి రావాలని పిలిచిందన్నారు. సహజనటి జయసుధను చాలా మంది ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. మా నిధుల సేకరణ టీఎస్సార్ నిర్వహించాలి : రాజశేఖర్ రాజకీయ, సినీ ప్రముఖులను అందర్నీ ఒకే చోట తీసుకురావడంతో టీఎస్సార్‌ను మించిన వారు ఎవరూ లేరని నటుడు రాజశేఖర్ అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం చేపట్టబోయే నిధుల సేకరణ కార్యక్రమాలను కూడా టీఎస్సార్ నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సినీ పరిశ్రమకు వైజాగ్ వరం వైజాగ్ ప్రజలను ప్రతి సంవత్సరం కలిసేందుకే టీఎస్సార్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా అని అనిపిస్తుందని నటి జయప్రద అన్నారు. సినీ పరిశ్రమకు వైజాగ్ ఓ వరమన్నారు. జయసుధతో కలిసి అనేక సినిమాల్లో నటించానని, ఆమె అద్భుత నటి అని కొనియాడారు. నవ్వులు పూయించిన శరత్ కుమార్ నటుడు శరత్ కుమార్ తన మాటలతో నవ్వులు పూయించారు. టీఎస్సార్ ఈ వయస్సులో కూడా తన వాయిస్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నారన్నారు. 46 ఏళ్ల పాటు సినీ పరిశ్రమలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జయసుధ రాణించడం అభినందనీయమన్నారు. సెప్టెంబర్ 17న సినీ పరిశ్రమలో ప్రముఖులు అంత ఎక్కడ ఉంటారు అంటే విశాఖలోనే అని గత కొన్నేళ్లుగా రుజువు అవుతుందన్నారు. -
సెప్టెంబర్ 8న ‘సినీ రథసారథుల రజతోత్సవం’
తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ సినీ మహోత్సవం.. రథసారథుల రజతోత్సవం సెప్టెంబర్ 8న హైదరాబాద్ గచ్చిబోలి ఇండోర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రొడక్షన్ మేనేజర్లందరూ కలిసి చేస్తున్న ఈ సిల్వర్ జూబ్లీ ఈవెంట్ కర్టన్ రైజర్ ప్రెస్‌మీట్ జరిగింది. కళాబంధు టి. సుబ్బిరామి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ... కళాబంధు టి.సుబ్బరామి రెడ్డి మాట్లాడుతూ ‘హైదరాబాద్ నగరంలో సినీ ఆర్టిస్ట్‌లందరూ కలిసి చాలా కాలం అయ్యింది. చాలా గ్యాప్ తరువాత ప్రొడక్షన్ మేనేజర్లు కలిసి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకోవడం సంతోషంగా ఉంది. సెప్టెంబర్ 8న జరగబోయే ఈ ఫంక్షన్ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ ఈవెంట్‌కు సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు’ అన్నారు. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ప్రెసిడెంట్ అమ్మిరాజు మాట్లాడుతూ ‘మేం చేస్తున్న ప్రయత్నానికి సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమంలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే పెద్ద మనసుతో క్షమించాలి. సపోర్ట్ చేస్తోన్న జెమినీ కిరణ్‌గారికి థ్యాంక్స్. సుబ్బిరామి రెడ్డి గారు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. పేరు పేరున ఈ ఈవెంట్ సక్సెస్ చేసిన వారందరికి థాంక్స్ తెలుపుతున్నాను. సెప్టెంబర్ 8న జరగబోయే ఈ ఫంక్షన్‌కు ఇలాగే అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. వీరితో పాటు మా అధ్యక్షుడు వికె నరేష్, ఉపాధ్యక్షుడు డా. రాజశేఖర్, నటులు అల్లరి నరేష్, సందీప్ కిషన్, ప్రగ్యా జైస్వాల్, రెజీనా, వెన్నెల కిశోర్, సంపూర్ణేష్ బాబు, శివ బాలాజీ, రాజీవ్ కనకాల, హేమ, ఉత్తేజ్, నిర్మాతలు సీ కల్యాణ్, ఎమ్ఎల్ కుమార్ చౌదరి, దామోదర్ ప్రసాద్, దర్శకులు బాబీ, బొమ్మరిల్లు భాస్కర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమ నిర్వాహకులకు తమ మద్ధుతు తెలిపారు. -
బి.సరోజాదేవికి ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదు ప్రదానం
అలనాటి అందాల నటి బి.సరోజాదేవిని టీఎస్ఆర్ లలితకళాపరిషత్ ‘విశ్వనట సామ్రాజ్ఞి' బిరుదు తో సత్కరించనుంది. కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి మార్చి 4 మహాశివరాత్రి సందర్భంగా విశాఖలో లో వైభవంగా జరిగే వేడుక లో ఈ బిరుదును ప్రదానం చేయనున్నట్టుగా తెలిపారు. విశాఖ రామకృష్ణా బీచ్ లో మార్చి 4 సాయంత్రం ఐదు గంటల నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రజలచేతనే కోటి శివలింగాల ప్రతిష్ఠాపన, మహాకుంభాభిషేకం కార్యక్రమాలను నిర్వహించనున్నారు. గత పాతికేళ్ల ఈ కార్యక్రమాలను టీఎస్సార్ కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మిస్తున్న బి.సరోజాదేవి సన్మాన కార్యక్రమంలో ప్రముఖ నటీనటులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, సుమన్, మీనా, గాయని పి.సుశీల పాల్గొననున్నారు. కన్నడ నాట జన్మించిన బి.సరోజాదేవి, తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితులు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘పాండురంగ మహాత్మ్యం’ సినిమా ద్వారా బి.సరోజాదేవిని తెలుగుతెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత ఎన్టీఆర్ సరసన సీతారామకళ్యాణం, జగదేకవీరుని కథ, దానవీరశూర కర్ణ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అక్కినేని నాగేశ్వరరావుతోనూ పెళ్ళికానుక, ఆత్మబలం, అమరశిల్పి జక్కన్న లాంటి సినిమాలో అలరించారు. తెలుగునాటనే కాకుండా, మాతృభాష కన్నడలోనూ, తమిళ, మళయాళ, హిందీ భాషల్లోనూ సరోజాదేవి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను సైతం అందుకున్నారు. -
పదేళ్ల క్రితం వచ్చిన ఆలోచన ఇది
‘‘కళాకారులకు జాతీయ స్థాయిలో ఫిల్మ్ అవార్డులు ఇవ్వాలని పదేళ్ల కిత్రం నాకో ఆలోచన వచ్చింది. అదీ ప్రజాభిప్రాయం తెలుసుకుని ఇవ్వాలని. ప్రజాభిప్రాయ సేకరణకు టీవీ చానల్ ఉంటే బాగుంటుందని టీ వీ9తో కలిసి ‘టీఎస్ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’ని స్థాపించా’’ అని కళాబంధు, ‘టీఎస్ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’ చైర్మన్ టి.సుబ్బరామి రెడ్డి అన్నారు. 2017, 2018 సంవత్సరాలకు ‘టీఎస్ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’కి ఎంపికైన వారి వివరాలను గురువారం సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఈ అవార్డ్స్ ఫంక్షన్‌ని ఈ నెల 17న విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియంలో నిర్వహిస్తున్నాం. తెలుగు, హిందీ, పంజాబీ, భోజ్‌పురి, తమిళ్, కన్నడ, మలయాళం.. ఇలా భారతదేశంలోని అన్ని భాషల నటీనటులకు అవార్డులు ఇస్తున్నాం. ఈ అవార్డుల జ్యూరీ మెంబర్లుగా నగ్మా, జీవితా రాజశేఖర్, మీనా, పరుచూరి గోపాలకృష్ణ, కేఎస్ రామారావు, నరేశ్, రఘు రామకృష్ణంరాజు, పింకీ రెడ్డి, శోభన కామినేని వ్యవహరించారు. వేలాది మంది ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అన్ని భాషల నుంచి దాదాపు 60మంది ఫిల్మ్ స్టార్స్ అవార్డులు తీసుకోనున్నారు’’ అన్నారు. జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికైన నటి నగ్మా మాట్లాడుతూ –‘‘నా లైఫ్ ఇంకా చాలా ఉంది.. ఇంకా చాలా సినిమాలు చేయాలి. అప్పుడే మీరు (సుబ్బరామిరెడ్డి) లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు ప్రకటించారు (నవ్వుతూ). ఈ అవార్డుతో పాటు సామాజిక సేవ చేసినందుకు మార్చిలో ‘రాజీవ్‌గాంధీ’ అవార్డుకూడా అందుకోబోతున్నా. తెలుగులో నా సినీ ప్రయాణం ఇంకా కొనసాగాలి’’ అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘అందరికంటే కష్టమైన పని ఏంటంటే జ్యూరీ సభ్యునిగా ఉండటం. నక్షత్రాల్లో చంద్రుడ్ని చూపించి ఇందులో ఎవరు పెద్ద, గొప్ప అంటే చంద్రుడ్ని చూపిస్తాం. అందరి చంద్రుల్ని చూపించి ఇందులో ఏ చంద్రుడు గొప్ప అంటే ఏం చెబుతాం? అలా ఈ హీరోలు, హీరోయిన్లందరూ చందమామలే. మా అదృష్టం ఏంటంటే కొన్ని వేలమంది చక్కగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. మేం రెండు మూడుసార్లు చర్చించుకుని ఫైనల్ లిస్ట్ తయారు చేశాం. వర్షం పడితే రైతుకు ఆనందం. కళాకారుల ముఖం ఆనందంతో తడిస్తే మా సుబ్బరామిరెడ్డిగారికి ఆనందం. మహాభారతంలో ధర్మరాజును అజాతశత్రువు అంటారు. ఈ భారతదేశంలో నాకు సజీవంగా కనిపిస్తున్న ఏకైక అజాత శత్రువు సుబ్బరామిరెడ్డిగారు’’ అన్నారు. జ్యూరీ సభ్యులు శోభన కామినేని, రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు. -
త్వరలో చిరంజీవి, పవన్‌కల్యాణ్‌తో సినిమా
హన్మకొండ కల్చరల్: కాకతీయుల కాలం నాటి కళా వైభవాన్ని చాటిచెప్పే విధంగా మార్చి 11న వరంగల్ కోటలో ‘కాకతీయ కళోత్సవం’ నిర్వహించ నున్నట్లు రాజ్యసభ సభ్యుడు, సినీ నిర్మాత డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయాన్ని ఎమ్మెల్యే దయాకర్‌రావుతో కలసి ఆయన సందర్శించారు. ఈ ఆలయాన్ని రక్షించు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చిరంజీవి, పవన్‌కల్యాణ్ హీరోలఠిుగా తాను త్వరలో కొత్త చిత్రాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. వారిద్దరి కాంబినేషన్లో తీసే సినిమాకు కథ కూడా సిద్ధమైందన్నారు. -
'మెగా మల్టీస్టారర్‌కు పవన్ ఓకె చెప్పాడు'
కళాబంధు టి సుబ్బిరామి రెడ్డి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో ఓ భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని ప్రకటించిన సుబ్బిరామిరెడ్డి. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. అయితే ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడిన పవన్, అలాంటి ప్రొపోజల్ తన దగ్గరకు రాలేదని వస్తే ఆలోచిస్తానని ప్రకటించటంతో ఈ భారీ మల్టీ స్టారర్ ఉంటుందో లేదో అన్న అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన సుబ్బిరామిరెడ్డి మరోసారి మెగా మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమవుతోందని ప్రకటించాడు. అంతేకాదు ఇప్పటికే పవన్ కళ్యాణ్ సంప్రదించామని.. ఆయన ఆనందంగా ఈ సినిమాకు అంగీకరించారని తెలిపాడు. ప్రస్తుతం చిరు, పవన్‌లు కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని తెలిపాడు. నిర్మాణంలో అశ్వనీదత్ తనకు సహకరిస్తారని తెలిపాడు. -
టీయస్సార్‌కి ఏయన్నార్ అవార్డు
ప్రతి ఏటా అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా వివిధ రంగాలకు చెందిన నిష్టాతులకు ‘రసమయి డా.అక్కినేని లైఫ్ టైమ్ అచీవ్మెంట్’ అవార్డు బహూకరిస్తున్నారు. ఈ ఏడాది ఈ అవార్డును ‘కళాబంధు టి.సుబ్బరామిరెడ్డికి అందించనున్నట్లు ‘రసమయి’ అధినేత డా.ఎంకె. రాము తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘ఏయన్నార్‌తో సుబ్బరామిరెడ్డికి 40 ఏళ్ల అనుబంధం ఉంది. సినీ కళాకారులను సత్కరిస్తూ ప్రోత్సహిస్తున్న ఆయనకు ఈ అవార్డు ఇవ్వడం సముచితం. ఈనెల 21న హైదరాబాద్‌లో అవార్డు ప్రదానం చేయబోతున్నాం. ఈ వేడుకకు పలువురు రాజకీయ నాయకులు, సినిమా కళాకారులు హాజరు కానున్నారు’’ అని తెలిపారు.