టీయస్సార్‌కి ఏయన్నార్ అవార్డు | ANR Award TSR | Sakshi
Sakshi News home page

టీయస్సార్‌కి ఏయన్నార్ అవార్డు

Published Mon, Sep 19 2016 12:05 AM | Last Updated on Thu, May 24 2018 12:20 PM

టీయస్సార్‌కి ఏయన్నార్ అవార్డు - Sakshi

టీయస్సార్‌కి ఏయన్నార్ అవార్డు

 ప్రతి ఏటా అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా వివిధ రంగాలకు చెందిన నిష్టాతులకు ‘రసమయి డా.అక్కినేని లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు బహూకరిస్తున్నారు. ఈ ఏడాది ఈ అవార్డును  ‘కళాబంధు టి.సుబ్బరామిరెడ్డికి అందించనున్నట్లు ‘రసమయి’ అధినేత డా.ఎంకె. రాము తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘ఏయన్నార్‌తో సుబ్బరామిరెడ్డికి 40 ఏళ్ల అనుబంధం ఉంది. సినీ కళాకారులను సత్కరిస్తూ ప్రోత్సహిస్తున్న ఆయనకు ఈ అవార్డు ఇవ్వడం సముచితం. ఈనెల 21న హైదరాబాద్‌లో అవార్డు ప్రదానం చేయబోతున్నాం. ఈ వేడుకకు పలువురు రాజకీయ నాయకులు, సినిమా కళాకారులు హాజరు కానున్నారు’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement