మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న తాజా హిస్టారికల్ చిత్రం ‘మరక్కార్: అరేబియా సముద్ర సింహం’. దర్శకుడు ప్రియదర్శన్‌కు ఈ చిత్రం డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. దీంతో ఈ చిత్రాన్ని మోహన్‌లాల్‌తో కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఆశిర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటొని పెరుంబవూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో మార్చి 26న విడుదలవుతోంది. చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ఫస్ల్ లుక్ పోస్టర్స్ అదిరిపోగా.. తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
తెలుగులో ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ఇక తమిళ ట్రైలర్‌ను సూర్య, కన్నడ ట్రైలర్‌ను యశ్, హిందీ ట్రైలర్‌ను అక్షయ్ కుమార్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి విశేష స్సందన వస్తోంది. భారీ తారాగణంతో కనుల విందుగా ఉన్న ట్రైలర్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. యువ హీరోలతో పోటీపడుతూ వైవిధ్యభరిత పాత్రలను, కథలను ఎంచుకుంటున్న మోహన్‌లాల్‌కు సలాం కొడుతున్నారు. అంతేకాకుండా ‘ఇది మలయాల బాహుబలి’అని, బాహుబలి రేంజ్‌లో మరక్కార్ సక్సెస్ కావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
16వ శతాబ్దానికి చెందిన కుంజాలి మరక్కార్ అనే నావికుడి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్ యంగ్ పాత్రలో ఆయన కొడుకు ప్రణవ్ మోహన్‌లాల్ నటించారు. ఆర్చ అనే పాత్రలో కీర్తి సురేష్ కనిపించనున్నారు. భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, ప్రభు, మంజు వారియర్, సుహాసిని, కళ్యాణి ప్రియదర్శన్, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.‘బాహుబలి’కి పనిచేసిన సాబు సిరిల్ ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. దాదాపు వందకోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న తొలి మలయాళ చిత్రం ‘మరక్కార్’కావడం విశేషం. రోనీ రాఫెల్ సంగీతం సమకూర్చగా.. తిరు సినిమాటోగ్రఫీ అందించారు.
చదవండి:
సినీ నిర్మాత నట్టి కుమార్‌కు ఏడాది జైలుశిక్ష
గుడ్‌న్యూస్ చెబుతారా?
Comments
Please login to add a commentAdd a comment