ప్రముఖ నటుడు మోహన్ లాల్ తన విలక్షణ నటనతో ఎందరినో ఆకట్టుకున్నారు. అయితే, తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ఫాంటసీ చిత్రం ‘బరోజ్’. సుమారు నాలుగేళ్ల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ ను ఆపేశారు. కానీ, ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించే సమయానికి మోహన్ లాల్ అప్పటికే కమిట్ అయిన సినిమాల నుంచి ఒత్తిడి వచ్చింది దీంతో బరోజ్ షూటింగ్ పనులు చాలా నెమ్మదిగా సాగాయి.
తాజాగా మోహన్ లాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బరోజ్ గురించి అప్‌డేట్ ఇచ్చారు. 'బరోజ్' తన రహస్యాలను 3 అక్టోబర్ 2024న వెల్లడించడానికి వస్తున్నాడని విడుదల తేదీని ప్రకటించారు. అద్భుత సాహసం కోసం మీ క్యాలెండర్‌లో ఆ తేదీని నోట్ చేసుకోండి.' అంటూ మోహన్ లాల్ తెలిపారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో మోహన్ లాల్ గుండు, గుబురు గడ్డంతో ఉన్నారు. అలాగే ఈ సినిమాను త్రీడీ విధానంలో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ఇండియాలోనే మొదటి త్రీడీ చిత్రం మై డియర్ కుట్టిచాతన్‌కు దర్శకత్వం వహించిన జిజో పున్నూస్ కథను అందించారు. సినిమాటోగ్రాఫర్‌గా సంతోష్ శివన్ పనిచేశారు.
వాస్కోడిగామా నిధిని కాపాడే జినీగా మోహన్ లాల్ నటిస్తున్నాడు. వాస్కోడిగామాకి చెందిన అపార సంపద (బంగారం,వజ్రాలు) బరోజ్ అనే ఒక భూతం 400 ఏళ్ళగా కాపాడుతూ వస్తుంది. ఆయనకు సంబంధించిన నిజమైన వారసులకు ఆ సంపదని అప్పగించాలని ఆ భూతం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్‌తో సినిమా ఉండనుంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా 'బరోజ్' చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయన నిర్మిస్తున్నారు. ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాతగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 3న తెలుగు,హిందీ,తమిల్,కన్నడ,మలయాళంలో బరోజ్ సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment