
మోహన్‌లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందుతున్న బహు భాషా చిత్రం ‘మరక్కార్: అరబికడలింటే సింహమ్’. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, సునీల్ శెట్టి, ప్రభుదేవా, కీర్తీ సురేశ్, ప్రణవ్ మోహన్‌లాల్, కల్యాణీ ప్రియదర్శన్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. మోహన్‌లాల్, సునీల్ శెట్టి, ప్రభుదేవాలపై కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారు. ఈ సినిమాలోని సునీల్ శెట్టి లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రబృందం. ఓ హాలీవుడ్ సినిమాలోని వార్ ఫిల్మ్ ఆధారంగా ఆయన లుక్‌ను డిజైన్ చేశారట. ఈ చిత్రంలో వారియర్‌గా (యోధుడు) సునీల్‌శెట్టి నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment