పెళ్లిలో సూపర్‌ స్టార్‌ సందడి, వైరల్‌ వీడియో | Antony Perumbavoor daughter marriage, Mohanlal enjoys with family | Sakshi
Sakshi News home page

పెళ్లిలో సూపర్‌ స్టార్‌ సందడి, వైరల్‌ వీడియో

Dec 28 2020 8:11 PM | Updated on Dec 28 2020 9:47 PM

Antony Perumbavoor daughter marriage, Mohanlal enjoys with  family - Sakshi

తిరువనంతపురం: ప్రముఖ మలయాళ నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ కుమార్తె అనిషా, ఎమిల్ విన్సెంట్‌ వివాహ వేడుకలో  మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్  తనకుటుంబంతో కలిసి సందడి చేశారు.  తన  మిత్రుడు ఆంటోనీ కుమార్తె  పెళ్లి వేడుకలో తన భార్య సుచిత్రా, కొడుకు , నటుడు ప్రణవ్ మోహన్ లాల్  కుమార్తె విస్మయతో కలిసి సందడి చేశారు.ఆదివారం కేరళ చర్చిలో జరిగిన వివాహ వేడుకకు వీరు హాజరయ్యారు. నూతన  దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ మోహన్ లాల్ సోమవారం పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో  హిట్‌ టాక్‌గా నిలుస్తోంది.  మోహన్ లాల్ ఇంతకుముందు ఈ జంట ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లో కూడా పాల్గొన్నారు.  మరోవైపు తన కుమార్తె పెళ్లికి హాజరై, ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ఆంటోనీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement