తొలిడోసును తీసుకున్న మలయాళ సూపర్‌ స్టార్‌ | Mohanlal Gets First Shot Of Covid-19 Vaccine | Sakshi
Sakshi News home page

తొలిడోసును తీసుకున్న మలయాళ సూపర్‌ స్టార్‌

Published Wed, Mar 10 2021 4:07 PM | Last Updated on Wed, Mar 10 2021 4:15 PM

Mohanlal Gets First Shot Of Covid-19 Vaccine - Sakshi

బెంగళూరు: కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భాగంగా మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌(60) బుధవారం ఉదయం బెంగళూరులోని అమృత ఆసుపత్రిలో తొలి డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విటర్‌లో తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు.  టీకా తీసుకున్న చిత్రాలను  షేర్‌ చేశారు. అంతేకాదు ఎలాంటి సందేహం లేకుండా అర్హులైన వారంతా టీకా తీసుకోవాలని కోరారు. ఈ సందర్బంగా  కోవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీలో భాగమైన కంపెనీలకు, భారత ప్రభుత్వానికి, వైద్య సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.


కాగా మోహన్‌లాల్‌ తాజా చిత్రం దృశ్యం 2  గత నెలలో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే .జార్జ్‌ కుట్టిగా నటించిన మోహన్‌ లాల్‌ నటనకు విమర్శకులు , ప్రేక్షకుల నుంచి మన్ననలను పొందారు. మరోవైపు బరోజ్ సినిమాతో మోహన్‌లాల్‌ డైరక్టర్‌గా అవతారమెత్తారు. ప్రస్తుతం ఆయన బరోజ్‌ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్‌కానుందని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement