రవితేజ హీరోగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రం 'ఈగల్'. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. జవనరి 13న సంక్రాంతి కానుకగా రావాల్సిన ఈ సినిమా థియెటర్ల కొరత ఉండటంతో అప్పుడు వాయిదా పడింది. సంక్రాంతి సినిమాల విడుదలపై.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమావేశం అయి ఈ నిర్ణయం తీసుకున్నారు.
రోజుల వ్యవధిలోనే ఐదు సినిమాలు విడుదలైతే పలు ఇబ్బందులు వస్తాయిని దానిపై ఈగల్ నిర్మాతలతో సుదీర్ఘ చర్చలు అప్పట్లో జరిగాయి. వారందరి కోరిక మేరకు ‘ఈగల్’ నిర్మాత తమ సినిమాని పోస్ట్‌పోన్ చేసేందుకు అంగీకరించారు. అందుకు గాను ఈగల్ సినిమాకు సింగిల్ రిలీజ్ డేట్‌గా ఫిబ్రవరి 9 ఫైనల్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఈగల్ సినిమాకు అలాంటి పరిస్థితే వస్తుంది. ఫిబ్రవరి 8న యాత్ర-2, ఊరు పేరు భైరవకోన చిత్రాలతో పాటు ఫిబ్రవరి 9న లాల్ సలామ్ విడుదల కానుంది. అంటే ఈగల్ సినిమాతో కలిపి మొత్తంగా నాలుగు సినిమాలు ఉన్నాయి. దీంతో తాజాగా ఈగల్ సినిమాకు సంబంధించిన పీపుల్స్ మీడియా వారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు లేఖ రాశారు.
సంక్రాంతికి రావాల్సిన ఈగల్ సినిమా ఛాంబర్ పెద్దల నిర్ణయం మేరకు, సినీ పరిశ్రమ మంచి కోసం తాము వాయిదా వేసుకున్నామని ఆ లేఖలో తెలిపారు. ఈ క్రమంలో తమ ఈగల్ సినిమాకు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని మాట ఇచ్చారు. కానీ తమ సినిమా రిలీజ్ రోజే మరి కొన్ని సినిమాలు విడుదల కానున్నాయని తెలిపారు. ఈగల్ సినిమాకి సోలో డేట్ ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలని పీపుల్స్ మీడియా విజ్ఞప్తి చేసింది. ఈగల్ సినిమా సోలోగా విడుదలయ్యేలా సహకరించాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను కోరింది. ఈ లేఖకు ఎలాంటి సమాధానం ఇంకా వెలువడలేదు.
Ravi Teja’s #Eagle Solo Release issue. pic.twitter.com/BOauCOiKMm
— Christopher Kanagaraj (@Chrissuccess) January 19, 2024
Comments
Please login to add a commentAdd a comment