
సంక్రాంతి రావాల్సిన మాస్ మహారాజా ఫిబ్రవరికి రెడీ అయిపోయారు. రవితేజ, అనుమప పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ ఈగల్ మరో మూడు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం గ్రాండ్‌గా నిర్వహించారు. గతేడాది రావణాసుర, టైగర్ నాగేశ్వరరావుతో అలరించిన మాస్ హీరో మరోసారి ఫుల్ యాక్షన్ ట్రీట్ ఇవ్వనున్నారు. అయితే ఈ సినిమాకు రిలీజ్‌కు చిత్రబృందం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అదేంటో తెలుసుకుందాం.
పెద్ద సినిమాలు అంటే టికెట్ల రేట్స్ కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. మొదటి రోజు బుకింగ్స్ దొరకడం కూడా కష్టమే. సినిమా బడ్జెట్ ఆధారంగా మేకర్స్ టికెట్ రేట్లు పెంచేస్తుంటారు. పెద్ద హీరోల సినిమాలకు ప్రభుత్వాలు సైతం ధర పెంచుకునేందుకు సడలింపులు ఇస్తాయి. కానీ ఈగల్ మేకర్స్ మాత్రం ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఈగల్ సినిమా టికెట్లను మామూలు రోజుల్లో ఉండే ధరలకే అందుబాటులో ఉంచారు.
హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌ల్లో ఉండే టికెట్ ధర రూ.200, సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో రూ.150కే పరిమితం చేశారు. అత్యధికంగా మల్లీప్లెక్స్‌లలో టికెట్ ధర రూ.295 వరకు పెంచుకునే అవకాశం ఉంది. కానీ ఈగల్ సినిమాను ఎక్కువమంది చూడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా.. మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ రూ.200 మాత్రమే చూపిస్తోంది. ఫిబ్రవరి, మార్చిలో పరీక్షల సమయం కావడంతో స్టూడెంట్స్ చాలా వరకు సినిమాలకు దూరంగా ఉంటారు. ఇది కూడా ఒక కారణం అయినప్పటికీ.. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే మేకర్స్ డేరింగ్ డెసిషన్ తీసుకున్నట్లు అనిపిస్తోంది.
ర్యాప్ వీడియో వైరల్
అయితే ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ఓ యువకుడు రవితేజ సినిమాలను డైలాగ్స్‌తో అదిరిపోయేలా పాట పాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సైతం ఆ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసింది.
The video is so good that even the pause button has given up. Can someone send us help or more popcorn? 🍿,🫠
Cinema Cinema Cinema ♥️#RaviTeja #EAGLEonFEB9th #Eagle pic.twitter.com/oMqjByZqUF— People Media Factory (@peoplemediafcy) February 6, 2024
Comments
Please login to add a commentAdd a comment