
ఆంటిగ్వా: టీమిండియా క్రికెటర్, హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడిపై డ్వేన్ బ్రేవో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అంబటి రాయుడు అనే వ్యక్తి ఒక ముక్కోపి అని బ్రేవో వ్యాఖ్యానించాడు. గత కొన్ని సీజన్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అంబటి రాయుడు-బ్రేవోలు కలిసి ఆడుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రాయుడు గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు బ్రేవో. సీఎస్‌కే ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో రాయుడితో ఆడిన సందర్భాల్లో తాను ఎలా ఉండేవాడినో బ్రేవో చెప్పుకొచ్చాడు. రాయుడితో ఐపీఎల్ మ్యాచ్‌లు కలిసి ఆడినప్పుడు చాలా విషయాల్లో తప్పుగా అర్ధం చేసుకున్నానని వ్యాఖ్యానించాడు. (‘ధోని వ్యూహాలకు తగ్గ కెప్టెన్లను తీసుకున్నాడు’)
‘అంబటి రాయుడు నా ఫేవరెట్ ప్లేయర్లలో ఒకడు. మేమిద్దరం ముంబై ఇండియన్స్‌కు ఆడాం. కానీ ఇద్దరం కలిసి ఆడిన సందర్భాలు చాలా తక్కువ. నా తరహాలోనే అతను ప్లేయర్. అతనొక ముక్కోపి. అతను కరెక్ట్ కాదని అనుకుడేవాడిని. ఆ విషయాల్ని తప్పని రాయుడు నిరూపించాడు. ‘‘నువ్వొక చెత్త.. మంచి వాడివి కాదు.. చెన్నై నిన్ను ఎందుకు కొనుగోలు చేసిందో’’ అనే వ్యాఖ్యలతో రాయుడ్ని ఏడిపించడం ఇష్టం. నేనే సీఎస్‌కేకు ఆడిన తొలి సీజన్‌లో ఎప్పుడూ నా పక్కనే కూర్చొని ఉండేవాడు. నాకు అతను నచ్చక నేను కూడా నెగిటివ్ విషయాల్నే మాట్లాడేవాడిని. రాయుడితో అంత సఖ్యత ఉండేది కాదు. అవి తప్పని రాయుడు నిరూపించాడు. అతనొక ప్రత్యేకమైన వ్యక్తి. మీరు ఏ వ్యక్తి గురించైనా తెలుసుకోవాలంటే ముందు అతనితో సఖ్యత ద్వారానే తెలుసుకుంటాం. ఒకవేళ తెలియకపోతే సదరు వ్యక్తి గురించి చెడు అభిప్రాయం వస్తుంది. రాయుడు నిజమైన క్రికెటర్. క్రికెట్‌ను బాగా ఆస్వాదిస్తాడు’ అని బ్రేవో తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment