![Dwayne Bravo Equals Lasith Malinga Highest Wicket Taker List IPL History - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/26/Bravo.jpg.webp?itok=yU8bahjh)
Courtesy: IPL
సీఎస్‌కే ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో సామ్ బిల్లింగ్స్‌ను ఔట్ చేయడం ద్వారా బ్రావో 170వ వికెట్ సాధించాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా లసిత్ మలింగతో కలిసి తొలి స్థానంలో నిలిచాడు. వీరిద్దరి తర్వాత అమిత్ మిశ్రా 160 వికెట్లతో రెండో స్థానంలో.. 157 వికెట్లతో పియూష్ చావ్లా మూడో స్థానంలో, హర్బజన్ సింగ్ 150 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక బ్రావో మరొక వికెట్ తీస్తే ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవనున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే కేకేఆర్ శుభారంభం చేసింది. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రహానే 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సామ్ బిల్లింగ్స్ 25, శ్రేయాస్ అయ్యర్ 20 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. సీఎస్‌కే బౌలర్లలో డ్వేన్ బ్రేవో 3, మిచెల్ సాంట్నర్ ఒక వికెట్ తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment